ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు ‘భీమ్లా నాయక్’

bheemla_nayak_pawan_kalyans_intense_look_in_the_new_poster
Spread the love

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ గా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మలయాళం సూపర్ హిట్ మూవీకి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటించగా.. కీలక పాత్రలో రానా నటించాడు. ఈ సినిమా ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ ను స్టార్ ఇండియా దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమా ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనుండగా స్టార్ మా లో టెలికాస్ట్ కు సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా విడుదల అయిన అయిదు వారాల తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక స్టార్ మా లో కూడా కొంత గ్యాప్ తర్వాత టెలికాస్ట్ చేసే విధంగా అగ్రిమెంట్ అయ్యిందనే సమాచారం. ఈ చిత్రంపై ఊగిసలాట మద్య విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. టికెట్ల రేట్ల విషయమై క్లారిటీ వచ్చిన తర్వాత సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికీ అనూహ్యంగా ముందే విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ‘భీమ్లా నాయక్’ దాదాపు అన్ని ఏరియాల్లో కూడా మంచి రేట్లను దక్కించుకుంది. ఏపీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నా కూడా భారీ రేటు పలికింది.
ఈమద్య కాలంలో థియేటర్ రిలీజ్ కంటే కూడా అధికంగా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మూడు నాలుగు వారాల్లోనే సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్న ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ ను కాస్త ఆలస్యంగానే స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇతర హీరోల సినిమాల విషయంలో కాకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి. రెండు వారాల్లో సాధ్యం అయినంతగా వసూళ్లను దక్కించుకుంటుంది. సినిమా సక్సెస్ టాక్ దక్కించుకుంటే తిరుగే లేదు. భారీ ఎత్తున వసూళ్లు నమోదు అయిన పవన్ కళ్యాణ్ సినిమా లను భీమ్లా నాయక్ బీట్ చేస్తుందనే నమ్మకంతో యూనిట్ సభ్యులు మరియు అభిమానులు ఉన్నారు. ఈమద్య కాలంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు పెద్ద ఎత్తున సినిమాలను తీసుకుంటూ తమ ఖాతాదారులను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటీవలే సూపర్ హిట్ మూవీ అఖండను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కూడా చిన్న పెద్ద సినిమాలు పలు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యి మంచి సక్సెస్ ను దక్కించుకున్నాయి. దాంతో భీమ్లా నాయక్ కూడా తప్పకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సందడి చేయడం ఖాయం అంటున్నారు. అదీ.. సంగతీ!!

Related posts

Leave a Comment