గమనం సినిమాతో నిర్మాతగా మారిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ త్వరలో తన బ్యానర్ కాళీ ప్రొడక్షన్స్ ద్వారా రెండో సినిమాను ప్రారంభించనున్నారు. గమనం చిత్ర దర్శకురాలు సుజనా రావ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. గమనం చిత్రం విమర్శకుల ప్రసంశలు పొంది మంచి చిత్రంగా నిలిచింది.
జ్ఞానశేఖర్ నిర్మించబోయే నూతన చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ఈ మూవీలో నటించే నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి. విఎస్.జ్ఞానశేఖర్ దర్శకుడు క్రిష్ తో కలిసి మణికర్ణిక, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో విద్యుత్ జవాల్ మరియు దర్శకుడు సంకల్ప్ రెడ్డి తో ఐబి 71 చిత్రానికి వర్క్ చేస్తున్నారు అలాగే తమిళ్ లో జయం రవితో ఒక సినిమా చేస్తున్నారు. సెలెక్టెడ్ గా కథ బలం ఉన్న సినిమాలను చేస్తూ వెళుతున్నారు జ్ఞానశేఖర్.