ప్రకృతినే పూజించే పండుగ సద్దుల బతుకమ్మ: చింతల సాయిబాబ

aler news
Spread the love

ప్రకృతినే పూజించే పండుగ సద్దుల బతుకమ్మ. ఆడబిడ్డలంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ బతుకమ్మ అని దీనశరణ్య స్వచ్ఛందసేవా సంస్థ అధ్యక్షులు చింతల సాయిబాబ అన్నారు. గురువారం ఆయన ‘టాలీవుడ్ టైమ్స్ న్యూస్’ ప్రతినిధితో మాట్లాడుతూ ”గడిచిన ఎనిమిది రోజులుగా తీరొక్క పువ్వులతో ఎంతో సంబరంగా జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో భాగంగా నేడు చివరి రోజు సద్దుల బతుకమ్మను ఆడబిడ్డలంతా ఘనంగా జరుపుకున్నారని అయన పేర్కొన్నారు. ప్రజాగాయని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్కతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నామన్నారు. పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే పండగ బతుకమ్మ పండగ అని అన్నారు. ప్రేమ సేవా సదనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మలో పాల్గొని ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశామన్నారు. పూలను పూజించి ఆరాధించే తెలంగాణ బతుకమ్మకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని తీరు తీరు పువ్వులతో పేర్చే బతుకమ్మ విశిష్టతను నిరంతరంగా చాటి చెప్పడానికి అందరూ ముందుండాలని సాయిబాబా కోరారు. ప్రేమ సేవాసదనం ఫౌండర్ ఆకవరం మోహనరావు, డైరెక్టర్ మహమ్మద్ కుర్షీద్ పాషా, సినీ దర్శకుడు ముప్పిడి సత్యం, కౌన్సిలర్ గుత్త శమంతారెడ్డి, డానియేల్ తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

Leave a Comment