ఇండస్ట్రీ హేమతో ఆడుకుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరుగుతున్న ‘మా’ ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ అనే నినాదాలు పైకి వినిపిస్తున్నాయి. కానీ, లోపల పోటీ రసవత్తరంగా వుంది. చిరంజీవికి మోహన్ బాబుకు మధ్య పోటీ అని చెప్పకనే తెలుస్తుంది. గెలుపు ఎలాగూ సినిమా బిడ్డలదే అని తేలిపోయింది. అయితే, జీవిత పోటీలోకి రావడంతో చిన్న ఆర్టిస్టులు, ముఖ్యంగా లేడీ ఆర్టిస్ట్స్ ఓట్లు చీలిపోతాయేమో అని, హేమ ను రంగంలోకి దించారు. నిజానికి హేమ మొదటి నుంచి కూడా లేడీ ఆర్టిస్ట్స్ పక్షమే. నిజానికి హేమ సీనియారిటీ సేవా భావం ప్రకారం చూసుకున్నా అధ్యక్ష పదవి కి అర్హురాలే. కానీ, మోహన్ బాబు పట్టు బట్టి ఓట్లు చీల్చి విష్ణు కు గెలుపు బావుటా అందించాలని హేమను జబర్దస్త్ గా రెచ్చగొట్టి రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. అయితే, చిరంజీవి వర్గం ఆమెను పోటీ లోంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇంకా ఎన్నికలకు మూడు నెలల సమయం వుంది కాబట్టి, హేమ బరిలోంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.చూద్దాం ఏం జరుగుతుందో!
- డాక్టర్ మహ్మద్ రఫీ