పలువురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల సంయుక్త కథనం క్షీరసాగర మథనం

ksheera Sagara Madhanam... A film by Software Engineers
Spread the love

ఆగస్టు 6 న థియేటర్లలో విడుదల

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పలు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో పని చేసే మెరికల్లాంటి కొందరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం "క్షీరసాగర మథనం". సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనిల్ పంగులూరి దర్శకత్వంలో అత్యంత ఆహ్లాదకరంగ రూపొందిన 'క్షీర సాగర మథనం' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 6... థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్న ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర  ప్రతినాయకుడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 
చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. 'శేఖర్ కమ్ముల, దేవా కట్టా, మధుర శ్రీధర్ రెడ్డి వంటి సాఫ్ట్ వేర్ టర్నడ్ డైరెక్టర్స్ ను స్ఫూర్తిగా తీసుకుని సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న కొందరు లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ "క్షీర సాగర మథనం" రూపొందించాం. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టు 6న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
 చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్.వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి!!

Related posts

Leave a Comment