లక్ష్యం దిశగా కేసీఆర్ ప్రభుత్వం – ఉప్పల్ నియోజకవర్గంలో హరితహారం
టాలీవుడ్ టైమ్స్ న్యూస్ – హైదరాబాద్ : ఉప్పల్ నియోజకవర్గంలో హెచ్.ఎం.టినగర్ , నాచారంలో శనివారం హరితహారం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ తో పాటు, స్థానిక కార్పొరేటర్ శాంతి,, సాయి జెన్ శేఖర్, కొట్టే శ్రీనివాస రావు, నంది కొండ శ్రీనివాస్ రెడ్డి , హెచ్.ఎం.టినగర్ అసోసియేయేషన్ మెంబర్స్ రవీందర్ రెడ్డి, యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ ‘టాలీవుడ్ టైమ్స్’ ప్రతినిధితో మాట్లాడుతూ -” హైదరాబాదు నగరంలో ఒక్కరోజులోనే 25 లక్షల మొక్కలు, ఒకేరోజు లక్షమంది 163 కిలోమీటర్ల పొడవునా నిలబడి మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. ప్రతీ రెండు గ్రామాలకు ఒక నర్సరీ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,213 నర్సరీలు ఏర్పాటుచేశారు. కేవలం ఒకే రకం చెట్లు కాకుండా నీడనిచ్చే చెట్లు, పండ్ల చెట్లు, పూల చెట్లు, ఔషధ మొక్కలను కూడా నాటారు. 2016లో నాటిన 46 కోట్ల మొక్కల్లో నీడ నిచ్చే వేప, మర్రి, రావి లాంటివి 36.81 కోట్ల మొక్కలు… టేకు, మద్ది లాంటి లాభదాయక చెట్లు మరో 8.5 కోట్ల మొక్కలు…పండ్ల చెట్లు కోటి దాకా ఉన్నాయి. అంతేకాకుండా పూలచెట్లు, ఈత మొక్కలు ఉన్నాయి. అటవీ ప్రాంతంలోనే కాకుండా అన్ని రహదారులకు ఇరువైపులా, విద్యాలయాల్లో, పోలీస్ ప్రాంగణాల్లో, మార్కెట్ యార్డుల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, శ్మశాన వాటికలు, గ్రేవ్ యార్డుల్లో, పరిశ్రమల్లో, పారిశ్రామిక వాడల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో మొక్కలు నాటారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ శాఖలు, పాఠశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, డ్వాక్రా మహిళలతో సహా అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ – విజయవాడ, హైదరాబాద్ – ముంబాయి, హైదరాబాద్ – వరంగల్, హైదరాబాద్ – బెంగుళూరు, హైదరాబాద్ – నాగపూర్ వంటి జాతీయ రహదారులకిరువైపులా పెద్ద పూల చెట్లు నాటారు. తెలంగాణ రాష్ట్ర భూభాగం 1,12,101 కిలోమీటర్లు ఉండగా అడవులు 26,903.70 కిలోమీటర్లమేర (24శాతం) ఉన్నాయి. హరితహారం ద్వారా అటవీ ప్రాంతాన్ని 33శాతానికి పెరిగేలా చేయడం.తద్వారా వానలు వాపస్ వచ్చేలా చూడటం. అడవిలో, రోడ్లకిరువైపులా పండ్ల చెట్లను నాటటంద్వారా నివాసాలు, పంటపొలాలపై దాడిచేస్తున్న కోతులకు ప్రత్యామ్నాయం చూపటం. వాతావరణంలో ప్రాణవాయువును పెంచటం, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటం, ఇతర పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడం నాలుగు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను నాటి సంరక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అటవీ ప్రాంతంలో 100కోట్ల మొక్కలు, అటవీ ప్రాంతం వెలుపల 120 కోట్ల మొక్కలు, జీహెచ్ఎంసీ పరిధిలో 10కోట్ల మొక్కలు పెంచడం. తెలంగాణలో ఉన్న 24 శాతం అటవీ ప్రాంతంలో నూటికి నూరు శాతం అడవులు పెంచడం . పట్టణాలు, గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున సామాజిక అడవుల పెంపకం. తెలంగాణ వ్యాప్తంగా ఐదేళ్ల కాలంలో 230 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం. అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు, సామాజిక అడవుల కింద 120 కోట్ల మొక్కలు, హైదరాబాద్ నగర పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటడ
సహజసిద్ధమైన అడవులను పరిరక్షించడం, పునరుజ్జీవింపచేయడం. అటవీ భూముల దురాక్రమణను అడ్డుకోవడం. పెద్ద ఎత్తున సాగే వృక్షాల నరికివేతను నిలువరించడం. సామాజిక అడవుల పెంపకానికి పెద్దఎత్తున చర్యలు చేపట్టడం. ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షణకు సమగ్ర చర్యలు చేపట్టడం హరిత హారం నినాదాలు. హరిత హారం లక్ష్యాలను విస్త్రుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు వివిధ నినాధాలను ఉపయోగిస్తున్నారు. హరిత హారం కార్యక్రమంలో మొక్కుబడిగా ఏదో ఒక మొక్కలు నాటకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా మొక్కలను నాటి వాటిని నిబద్ధతతో సంరక్షించి వాటి ప్రయోజనాలను సమాజానికి అందేలా చేస్తున్నారు. హరిత హారం మొదటి విడతను 2015 జులై 3న చిలుకూరులో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తొలి ఏడాది 15.96 కోట్ల మొక్కలు నాటారు. రెండో విడతను 2016 జులైన 8న చిట్యాలలో ప్రారంభించారు. రెండో విడత హరితహారాన్ని నల్లగొండ జిల్లా గుండ్రంపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించటం జరిగింది. ఆ దఫాలో 31.67 కోట్ల మొక్కలు నాటారు. మూడో విడతను 2017 జులైలో కరీంనగర్లో ప్రారంభించారు. 34 కోట్లకుపైగా మొక్కలు నాటారు. మూడో విడత హరితహారాన్ని కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు డ్యామ్ వద్ద మొక్క నాటి ప్రారంభిచటం జరిగింది. 2018 ఆగస్టు 1న మెదక్ జిల్లాలోని గజ్వేల్లో నాలుగో విడత హరిత హారం ప్రారంభం కాగా.. 32 కోట్ల మొక్కలు నాటారు. ఐదో విడతను కూడా గజ్వేల్లోనే ప్రారంభించగా 38 కోట్ల మొక్కలు నాటారు. ఆరో విడత హరితహారం కార్యక్రమం 2020, జూన్ 25న మెదక్ జిల్లాలోని నర్సాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి కెసీఆర్ అల్లనేరేడు మొక్కను నాటి ప్రారంభించాడు. ఈ విడత హరితహారం కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు . రాష్ట్రంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా హరిత హారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఆరో దశలో 30 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువగా మొక్కలు నాటగా.. ఈసారి అడవుల్లో ఎక్కువ మొక్కలు నాటే ప్రణాళికలు రూపొందించారు. హెచ్ఎండీఏ పరిధిలో 5 కోట్ల మొక్కలు.. జీహెచ్ఎంసీ పరిధిలో 2.5 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించారు. అటవీ శాఖ అధ్వర్యంలో 2.61 కోట్ల మొక్కలు నాటనున్నారు. హరితహారం కోసం రాష్ట్రంలోని 12,50 నర్సరీల్లో మొక్కలు సిద్దపరిచారు. తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను అడవుల్లా పెంచే జపాన్ పద్ధతి మియావాకీ పద్దతి అంటారు. ఈ విధానంలో పెంపకం వల్ల మొక్కలు అత్యంత త్వరితంగా పెరగడమే కాక దట్టంగా పచ్చదనంతో వనం మాదిరిగా కనిపిస్తుంది. ఆరవ దశ హరిత హారంలో ఈ పద్దతిని అనుసరిస్తున్నారు. “స్వదేశీ చెట్ల ద్వారా దేశీయ అడవులను” పునర్నిర్మించే మియావాకి పద్ధతి 20 నుండి 30 సంవత్సరాలలో గొప్ప, దట్టమైన, సమర్థవంతమైన రక్షిత మార్గదర్శక అడవిని ఉత్పత్తి చేస్తుంది” అని అన్నారు.