సికింద్రాబాద్ లోని మహబూబ్ డిగ్రీ కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు సివిల్స్, గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలపై ఉచిత అవగాహన కార్యక్రమం దీనశరణ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జెస్వాల్ సంజయ్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికా బద్దంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏ స్థాయిలో ఉన్న ఉద్యోగములో అయినా ముందుగా చేరి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని వివరించారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. సంస్థ అధ్యక్షుడు చింతల సాయి బాబా మాట్లాడుతూ సివిల్స్ పోటీ పరీక్షలకు ప్రభుత్వం నిర్బహించే స్టడీ సర్కిల్స్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఏసీపీ బీ రమేష్, హైకోర్టు న్యాయవాదులు గ్లోరీ ఆనంద, సంపత్ కుమార్, రాజు, మొటివేటర్ దాసి శంకర్, నాయకులు వెంకటేశ్వర్లు, సురేశ్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.
‘దీనశరణ్య’ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలపై అవగాహన
