తెలుగు సినిమా చరిత్రలో నాకంటూ ఓ పేరా అయినా ఉండాలనేదే నా పట్టుదల: యువ ప్రతిభాతరంగం పృథ్విరాజ్

Spread the love

“తెలుగు సినిమా చరిత్ర పుటల్లో ఓ మంచి నటుడిగా తనకంటూ కనీసం ఓ చిన్న పేరా అయినా ఉండాలనేదే తన పట్టుదలని.. ఎవరికైనా ఇది పేరాశగా అనిపిస్తే మన్నించండి” అంటున్నాడు యువ ప్రతిభాశాలి పృథ్విరాజ్. కంప్యూటర్స్ పట్టభద్రుడైన పృథ్విరాజ్ ఇప్పటికే కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి… సినిమా షూటింగ్ వాతావరణాన్ని ఆకళింపు చేసుకుని… కొద్ధో గొప్పో గుర్తింపునిచ్చే పాత్రల కోసం ఎదురు చూస్తున్నాడు.
బైక్ రేసింగ్ లో సిద్ధహస్తుడైన పృథ్విరాజ్.. ఐ.ఎస్.బి.కె రేసింగ్ అకాడమీ తరపున సర్టిఫైడ్ బైక్ రేసర్ గా పలు పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాడు. హీరో, విలన్, ఫ్రెండ్ క్యారెక్టర్… ఏదైనా సరే… ఎంత చిన్న పాత్ర అయినా సరే చేయడానికి తాను సిద్ధమని చెబుతున్న ఈ కత్తిలాంటి కుర్రాడికి… డాగ్స్ అంటే మహా ఇష్టం. దేశ విదేశాల్లోని డాగ్స్ గురించి ఇతనికి గల అవగాహన అపారం. పప్పీస్ పట్ల తనకున్న ఫ్యాషన్ తోనే… విదేశాల నుంచి మేలు జాతి పప్పీస్ సరఫరా చేసే బిజినెస్ పార్ట్ టైమ్ గా చేస్తుంటానని చెబుతున్నాడు పృథ్విరాజ్.
మంచి నటుడు కావడానికి అవసరమైన అభినయ సామర్థ్యంతోపాటు ‘క్రమశిక్షణ-అంకితభావం-కష్టపడే స్వభావం’ పుష్కలంగా కలిగిన పృథ్విరాజ్ ను ప్రోత్సహించాలనుకునేవారు 98490 29924 నంబర్ లో నేరుగా అతణ్ణి సంప్రదించవచ్చు.

Related posts

Leave a Comment