తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రసాద్ ఐ మ్యాక్స్ థియేటర్స్ అధినేత రమేష్ ప్రసాద్ కృతజ్ఞతలు

trs govt ku imax ramesh prasad thanks
Spread the love

తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రసాద్ ఐ మ్యాక్స్ థియేటర్స్ అధినేత రమేష్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను రమేష్ ప్రసాద్ కలిసి ఈ మేరకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న తెలుగు చలనచిత్ర రంగాన్ని ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచినందుకు ముఖ్యమంత్రి KCR కు, మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు, ప్రభుత్వానికి రమేష్ ప్రసాద్ కృతజ్ఞతలు చెప్పారు. లాక్ డౌన్ తో షూటింగ్ లు లేక, సుమారు ఏడాది పాటు థియేటర్ లు మూతబడి చిత్ర పరిశ్రమలో ని వేలాది మంది అనేక ఇబ్బందుకు గురయ్యారని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ రంగంపై ఆధారపడి న వారందరిలో మనోధైర్యాన్ని ఇచ్చిందని మంత్రికి మరోసారి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్ని విధాలుగా చేయూత అందిస్తుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. చలన చిత్ర పరిశ్రమలోని ని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వాటిని ముఖ్యమంత్రి KCR దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

Related posts

Leave a Comment