Aug 2, 2026

తమ్ముడు పవన్ తో అన్నయ్య చిరు మీటింగ్. ఇంతకీ ఏమైంది..?

pawankalyan tho chiranjivi meeting .. enthakee emaindhi?

pawankalyan tho chiranjivi meeting .. enthakee emaindhi?

Spread the love

అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్.. మధ్య మీటింగ్ జరిగిందని తెలిసింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ అన్నదమ్ములిద్దరూ ఏం మాట్లాడుకున్నారు.? ప్రత్యేకంగా కలుసుకోవడానికి కారణం ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. చిరంజీవి ప్రస్తుతం లూసీఫర్ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ క్రేజీ మూవీకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.
ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ భీమ్లా నాయక్ లో నటిస్తున్నారు. రానాతో కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్ ప్లే – సంభాషణలు అందిస్తుండడం విశేషం. ఇటీవల రిలీజ్ చేసిన భీమ్లా నాయక్ టీజర్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. ఈ సినిమా షూటింగ్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరుగుతుంది. పక్కపక్కనే ఈ మెగా బ్రదర్స్ షూటింగ్ జరుగుతుండడంతో కాస్సేపు ముచ్చటించుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నేరుగా తమ్ముడి సినిమా సెట్ లోకి వెళ్లారు. సినిమా యూనిట్, హీరో పవన్ అంతా కలిసి మెగాస్టార్ ను సాదరంగా ఆహ్వానించారు. అన్నదమ్ములు ఇద్దరూ కాస్సేపు కబుర్లు చెప్పుకున్నారు. ఇంతకీ ఏం మాట్లాడుకున్నారంటే.. పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడలేదు కానీ అన్న మెగాస్టార్ నే తన లూసిపర్ రీమేక్ అయిన గాడ్ ఫాదర్ విశేషాలు అన్నీ పంచుకున్నారని సమాచారం. లూసిఫర్ రీమేక్ లో సల్మాన్ నటిస్తున్నాడని ఆ విషయాన్నే తమ్ముడు పవన్ కు అన్నయ్య చిరంజీవి చెప్పినట్లు తెలిసింది. గమ్మత్తేమిటంటే.. అన్న చిరు ఆ టైమ్ లో ఖైదీ డ్రెస్ లో వుంటే… తమ్ముడు పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ లో ఉండడం విశేషం.