‘ట్రిపుల్ ఆర్’ తర్వాత ప్యాన్ ఇండియా ప్రాజెక్టులనే ఎన్టీఆర్ దృష్టి!

'ట్రిపుల్ ఆర్' తర్వాత ప్యాన్ ఇండియా ప్రాజెక్టులనే ఎన్టీఆర్ దృష్టి!
Spread the love

ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి పలువురు దర్శకులు ఇప్పుడు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో తన తదుపరి ప్రాజెక్ట్స్ చేస్తోన్న యంగ్ టైగర్ దూకుడు ఇక ఆగేట్లు లేదు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్వరలో కొరటాల శివ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌ ప్రాజెక్ట్ ఉంటుంది. దీంతో పాటు గతేడాది బంపర్ హిట్ ఇచ్చిన దర్శకుడికి కూడా ఓకే చెప్పినట్టు తెలిసింది. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి దాదాపు మూడేళ్లు కేటాయించారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ కారణంగా 2019, 2020, 2021 మూడేళ్లలో ఎన్టీఆర్ ఏ సినిమా విడుదల కాలేదు.కెరీర్ మొదలుపెట్టి నప్పటి నుంచి వరుసగా మూడేళ్లలో ఎన్టీఆర్ సినిమా విడుదల కాకపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అందులో కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో పాటు పలువురు దర్శకులున్నారు. త్వరలో ప్యాన్ ఇండియా లెవల్లో ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ పలకరించనున్న విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌.‌తో చేయాలనుకున్న సినిమా చివరి నిమిషంలో కాన్సిల్ అయింది. ఇపుడు అదే సినిమాను మహేష్ బాబుతో చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని కొరటాల శివతో చేయనున్నట్టు ప్రకటించారు. ఐతే.. ఈ కాంబినేషన్ ఎపుడో సెట్ అయినా.. ఈ నెల 7న పూజా కార్యక్రమాలతో అధికారికంగా పట్టాలెక్కింది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఆలియా భట్, జాన్వీ కపూర్ దాదాపు ఓకే అయినట్టు తెలిసింది. తాజాగా 31వ చిత్రాన్ని ప్రశాంత్ నీల్‌తో చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి. కొరటాల శివ ప్రాజెక్ట్ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే చిత్రాన్ని స్వాతంత్య్రం తర్వాత భారత్- పాకిస్థాన్ విడిపోయిన కాలం నాటి నుంచి ఆ తర్వాత భారత్, పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ యుద్ధంలో మన భారత యోధులు ఏ విధంగా పోరాటం చేసారనే ఇతివృత్తం ప్రధానంగా ఉంటుందని సమాచారం. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానతో ఓ సినిమా చేయడం దాదాపు ఓకే అయింది. ఇప్పటికే కథతో ఎన్టీఆర్‌ను ఇంప్రెస్ చేసినట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అలాగే .. ఎన్టీఆర్ తమిళ టాప్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్ నిర్మించనున్నట్టు తెలిసింది. ఈ ప్రాజెక్ట్ 2023లో పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అట్లీ షారుఖ్ ఖాన్‌తో ‘లయన్’ అనే సినిమా చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ అనిల్ రావిపూడితో ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈయన ఎఫ్ 3, ఆ తర్వాత బాలయ్య సినిమాల తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశాలున్నాయి. ఎన్టీఆర్.. వరసగా ‘ఖైదీ’, ‘మాస్టర్’ వంటి సినిమాలతో సత్తా చూపెట్టిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆసక్తి చూపెడుతున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య స్టోరీ డిస్కషన్ కూడా జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ దర్శకుడు కమల్ హాసన్‌తో ‘విక్రమ్’ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ఈ టాలీవుడ్ ప్రాజెక్ట్ ఖరారయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌తో పాటు లోకేష్ కనగరాజ్.. రామ్ చరణ్‌తో కూడా ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లలో ఎవరితో ముందుగా సినిమా చేస్తాడనేది చూడాలి. అటు ఎన్టీఆర్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే నాగ్ అశ్విన్ చెప్పిన కథకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రాన్ని కూడా వైజయంతీ మూవీస్ నిర్మించనుంది. ప్రభాస్..తో చేయబోయే ప్రాజెక్ట్ తర్వాత ఈ సినిమా ఉండనుంది. ఎన్టీఆర్ అటు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో హిందీలో డైరెక్ట్ ఓ సినిమా చేయనున్నట్టు బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విషయమై క్లారిటీ మాత్రం లేదు. ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ చారిత్రక నేపథ్యమున్న కథతోనే తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. మొత్తంగా ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎక్కువగా చారిత్రక నేపథ్యమున్న ప్యాన్ ఇండియా ప్రాజెక్టులనే ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు కనిపిస్తోంది.

Related posts

Leave a Comment