టీ.ఎల్.సి చర్చిలో అల్లి జయదీప్ కెన్ని ప్రధమ వర్ధంతి

kenni
Spread the love

ల్లి జయప్రసాద్ రావు – మధురవేణిల ఏకైక కుమారుడు అల్లి జయదీప్ కెన్ని ప్రధమ వర్ధంతి బుధవారం హైదరాబాద్ ఉప్పల్ లోని టీ.ఎల్.సి చర్చిలో జరిగిగింది. బంధుమిత్రులు-సన్నిహితులు-స్నేహితుల మధ్య జరిగిన ఈ కార్యక్రమాన్ని టీ.ఎల్.సి చర్చి పాస్టర్ రెవ. ప్రభాకర్ పాల్ నిర్వహించారు. 23-12-1985లో జన్మించిన అల్లి జయదీప్ కెన్ని బ్రెయిన్ లో తలెత్తిన సమస్యతో 28-07-2020లో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈసందర్బంగా టీ.ఎల్.సి చర్చి పాస్టర్ రెవ. ప్రభాకర్ పాల్ మాట్లాడుతూ -”కెన్నిగత ఏడాది 2020లో ఇదే రోజు దేవుని పిలుపునందుకొని అతడి తల్లిదండ్రులను వదిలి దేవుని సన్నిధికి చేరుకున్నాడు. ఈ లోకంలో ఎంతకాలం జీవించినప్పటికీ ఒక దిన ఉంటుంది. ముందు వెనకాల ప్రయాణం. అల్లి జయదీప్ కెన్నితన తల్లిదండ్రులకు మంచి కుమారుడిగా, స్నేహితులకు బెస్ట్ ఫ్రెండ్ గా , సంఘంలో ఒక మంచి విశ్వాసకుడిగా తనుజీవించిన కాలం కొద్ది దినాలైనప్పటికీ తను చేయాల్సిందంతా కూడా తల్లిదంరీలకు గాని, స్నేహితులకు గాని, సంఘంలో గాని అనేక జ్ఞాపకాల్ని విడిచి ఈ లోకాన్ని విడిచిపోయాడు. అల్లి జయప్రసాద్ రావు – మధురవేణిల ఏకైక కుమారుడు అల్లి జయదీప్ కెన్ని ప్రధమ వర్ధంతి సందర్బంగా ఎక్కడికి వచ్చిన అందరి హృదయాల్లో కెన్ని నిత్యం జీవించే ఉంటాడు” అని టీ.ఎల్.సి చర్చి పాస్టర్ రెవ. ప్రభాకర్ పాల్ ఈ సందర్బంగా పేర్కొన్నారు. ఈ అల్లి జయదీప్ కెన్ని ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో చర్చి మెంబెర్ యోహాన్ రాజు, నంది అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి అబ్దుల్, పర్వతనేని శేఖర్ రావు, విజయకుమారి, సైమన్ పాల్, టి. విజయ ప్రకాష్ రెడ్డి, అజయ్,ఎం శ్రీకర్, రాబర్ట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధమ వర్ధంతిని పురస్కరించుకొని లంచ్ ని అందించారు. అల్లి జయప్రసాద్ రావు కృతజ్ఞతలతో కార్యక్రమం ముగిసింది.

Related posts

Leave a Comment