టిఆర్ఎస్ ప్రభుత్వం దళితుల పట్ల వివక్ష చూపుతోంది

neelam venkataswamy
Spread the love

-దళితులకు ఇంటికొక ఉద్యోగం, బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి
-కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నీలం వెంకటస్వామి డిమాండ్

నీళ్లు.. నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ఎస్సీలకు ప్రాముఖ్యత కల్పించకపోవడం వారి అభివృద్ధికి తోడ్పాటు అందించకపోవడంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ను నియమించకపోవడం సిగ్గుచేటైన విషయమని కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నీలం వెంకటస్వామి విమర్శించారు. ఆయన ఈ మేరకు ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ ఎస్సీ కార్పొరేషన్ లో ఉన్న నిధులను కూడా అర్హులందరికీ ఇవ్వకపోగా, మళ్లీ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం దళిత సాధికారిక పథకం నియోజకవర్గానికి వందమందికి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడంలో ఆంతర్యమేమిటో ప్రజలందరికీ తెలుసునని, ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు దళితులు గుర్తుకు రావడం మామూలైపోయిందని నీలం వెంకటస్వామి దుయ్యబట్టారు. ఎన్నికల ముందు దళితులకు 3 ఎకరాల భూమి హామీ మరిచిపోయారు… ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని ఆయన పేర్కొన్నారు. దళితులకు ఇంటికొక ఉద్యోగం, బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, నియోజకవర్గంలో ఉన్న అర్హులైన దళితులఅందరికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందించాలని నీలం డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో దళిత మంత్రులకు కూడా స్థానం కల్పించక పోవడం బాధాకరమని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి ముగ్గురి దళిత మంత్రులకు స్థానం కల్పించారు మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఎంత మంది దళిత మంత్రులు ఉన్నారో? అంటూ దీన్నిబట్టే ఈ ప్రభుత్వానికి దళితులపై ఎంత వివక్ష ఉందో ఇట్టే అర్థమవుతుందని కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నీలం వెంకటస్వామి విమర్శించారు.

Related posts

Leave a Comment