జర్నలిస్టుల కుటుంబాలకు వచ్చే వారం వ్యాక్సిన్

Spread the love

జర్నలిస్టుల కుటుంబసభ్యులకు వచ్చే వారంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర
వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డా.జి శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (టిడబ్ల్యుజెఎఫ్) అధ్యక్షులు ఇ.చంద్రశేఖర్, కార్యదర్శి కె. నిరంజన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం సాయంత్రం కోఠిలోని కార్యాలయంలో డిహెచ్ ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా డిహెచ్ మాట్లాడుతూ, జర్నలిస్టులను ప్రభుత్వం ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించిందన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా వచ్చేవారం జర్నలిస్టు కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని హెచ్ యుజె ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. కరోనా బారినుంచి జర్నలిస్టులను కాపాడటానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కరోనా కష్టకాలంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా హెల్పులైన్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నందుకు హెయుజె తరుపున డిహెచ్ శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలిపారు.

Related posts

Leave a Comment