ఘనంగా నిర్మాత సిరిసాల యాదగిరి జన్మదినోత్సవ వేడుక

ఘనంగా నిర్మాత సిరిసాల యాదగిరి జన్మ దినోత్సవ వేడుక
Spread the love

హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత సిరిసాల యాదగిరి జన్మ దినోత్సవ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. శ్రీరామనవమి రోజునే యాదగిరి జన్మ దినోత్సవం కావడం విశేషమనే చెప్పాలి. ఆదివారం హైదరాబాద్ లోని సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలో ఆయన ఆత్మీయులు, కుటుంబ సభ్యులు శ్రీమతి ముత్యాలి, కూతురు అశ్విని, కుమారులు రితీష్, గౌతమ్, తల్లి సిరిసాల మారెమ్మ, తమ్ముడు సిరిసాల కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరిగిన వేడుకలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, ఫిలిం క్రిటిక్స్ అసోషియేషన్ జాయింట్ సెక్రటరీ ఎం.డి.అబ్దుల్ మాట్లాడుతూ.. పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో, జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో, మీ ఈ జీవితంలో ఎన్ని పరిచయాలు ఉన్నా, కలకాలం ఉండే తియ్యని స్నేహం మీది, అలాంటి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫ్రతీ క్షణం మీ చిరునవ్వుల స్నేహన్ని ఆశిస్తున్నాం. మీరు ఎప్పుడూ సంతోషంగా ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా, మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని, ఎల్లప్పుడూ నవ్వుతూ, హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. సిరిసాల యాదగిరి గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు మీకు, మీ కుటుంబానికి నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో శ్రీయుతులు పొనుగోటి కరుణాకర్ రావు, ఎం. తిరుపతి, మారంపల్లి దేవేందర్, పొల్కంపల్లి రవికుమార్, రాగిశెట్టి జనార్దన్, ఊకోటి రవికుమార్, యార్లగడ్డ జయదేవ్, నల్లా స్వామి, మంజు కన్ స్ట్రక్షన్ దేశెట్టి రఘు, జగదీష్ సాగర్, ఖాదర్, దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి, స్క్రీన్ స్క్రీన్ ప్లే రచయిత సికిందర్, సుంకర సాయినాధ్ , ముంబాయి పడ్వాల్ దినేష్ , మందాడి రాము , కోటేష్ , జెర్రిపోతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment