అందాలతార అను ఇమ్మాన్యుయేల్ కు టాలీవుడ్ లో కాలం కలిసిరాలేదు. బిగ్ స్టార్లతో కలిసి సినిమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా అను మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మంచు విష్ణు-శ్రీనువైట్ల కాంబినేషన్ లో చాలా గ్యాప్ తరువాత రాబోతున్న చిత్రం “డి&డి (డబుల్ డోస్)”. “ఢీ” సినిమాకి సీక్వెల్ ఇది. డబుల్ డోస్ అంటే వినోదంలో. అలాగే, గ్లామర్ డోస్ కూడా రెండింతలు ఉంటుంది. “డి&డి” లో అను ఇమ్మాన్యుయేల్, ప్రగ్యా జైశ్వాల్ ను హీరోయిన్లుగా తీసుకుంటున్నారట. మంచు విష్ణు, అను ఇమ్మాన్యుయేల్ ది ఫ్రెష్ కాంబినేషన్. అటు విష్ణు-ప్రగ్యా మాత్రం గతంలో ఓ సినిమా చేశారు. అను మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అను, ప్రగ్య ఇద్దరూ అందాలు బాగానే ఆరబోస్తారని ఇండస్ట్రీ చెబుతోంది. ఇండస్ట్రీయే ఎందుకు మనకు తెలియదా ఏంటీ? అనుకుంటున్నారు కదూ!? ఎవరెన్ని చెప్పిన తను మాత్రం ఇక ఆగలేను అంటోంది. టాలీవుడ్ ని ఇక దున్నేస్తానంటోంది.
గ్లామర్ డోస్ రెండింతలు పెంచేస్తానంటోంది!?
