కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం మా ద్యేయం : యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ

కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం మా ద్యేయం : యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ
Spread the love

యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆలేరు ఇందిర కాంగ్రెస్ భవన్ లో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ అధ్యక్షతన జిల్లా రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది, ఈ సందర్బంగా ప్రతి మండల పార్టీ అధ్యక్షురాలు మండల కమిటీలు, గ్రామ కమిటీలు బూత్ కమిటీలు వేయాలని సూచించడం జరిగింది, రాబోయే కాలం ఎలక్షన్ టైం కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని టిఆర్ఎస్-బిజెపిలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించి బిజెపి టిఆర్ఎస్ ప్రజలను మోసం చేసిన విధానాలను, పెంచుతున్న పెట్రోల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరల గురించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చేస్తున్న మోసాన్ని గురించి గడపగడపకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది,
ప్రతినెల జిల్లా జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రెటరీ పావని జిల్లా ప్రధాన కార్యదర్శి సుధారాణి, దుర్గా, లక్ష్మి బ్లాక్ అధ్యక్షరాలు జ్యోతి పట్టణ అధ్యక్షురాలు అనిత మండల పార్టీ అధ్యక్షులు రజిత, సబిత, ఝాన్సీ, చైతన్య, దీప లత, రజిత, మొదలగు వారు పాల్గొన్నారు,

Related posts

Leave a Comment