కళ్యాణం..కమనీయం సబిత-సాయికుమార్ ల వివాహమహోత్సవం!!

కళ్యాణం..కమనీయం సబిత-సాయికుమార్ ల వివాహమహోత్సవం!!
Spread the love

మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బిట్ల వెంకటేశ్వర్లు – బిట్ల పద్మ గార్ల ప్రథమ పుత్రిక చి.ల.సౌ. సబిత (ఎం.ఎస్) వివాహం శ్రీమతి అండ్ శ్రీ మంచాల రాజయ్య – లక్ష్మి గార్ల కనిష్ఠ పుత్రుడు చి. సాయికుమార్ (ఎం.టెక్)తో అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగింది. దైవజ్ఞులగు బ్రాహ్మణోత్తములచే 27 జనవరి 2023 శుక్రవారం ఉదయం 10.15 నిమిషములకు నిర్ణహించబడిన రేవతీ నక్షత్రయుక్త మీన లగ్న పుష్కరాంశ సుముహూర్తమున సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని సి. మల్లారెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కళ్యాణోత్సవానికి అతిరథమహారధులు హాజరై నూతన వధూవరులను అక్షింతలతో నిండుమనస్సుతో కలకాలం ఈ జంట కన్నులపంటగా ఉండాలని ఆశీర్వదించారు. సూర్యచంద్రుల సాక్షిగా ముత్యాల పందిరిలో వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే పెద్దల సమక్షమున మూడుముళ్ల బంధంతో వేయి జన్మల బంధంగా నూతన వధూవరులైన సబిత – సాయికుమార్ లు ఏడడుగులు నడవగా అంగరంగ వైభవంగా ఈ కళ్యాణోత్సవం జరిగింది. శతమానం భవతి అని దీవించి నూతన జంటను ముచ్చటైన జంటగా వర్ధిల్లమని బంధు-మిత్రులు తమ ఆశీస్సులు అందజేశారు. వారి అభినందనలు.. అక్షింతల జల్లులతో నూతన వధూవరులు ఆనందపారవశ్యంలో తెలియాడుతుండగా వివాహవేడుక తేజోవంతంగా వెలుగులు విరజిమ్మింది.
ఈ సందర్బంగా జరిగిన వివాహ మహోత్సవానికి యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్, మాజీ పార్లమెంట్ సభ్యుడు అంజన్ కుమార్, ఎమ్మెల్యే గరికపాటి గాంధీ, నేషనల్ దళితసేన జాతీయ అధ్యక్షులు జె.బి.రాజు, ఎస్సీ,-ఎస్టీ వెల్ ఫెర్ జాతీయ అధ్యక్షులు మహేశ్వర్ రాజు, మాల సంఘం జాతీయ అధ్యక్షులు చెన్నయ్య, హై-కోర్ట్ ఆఫ్ తెలంగాణ న్యాయవాది , ‘దీనశరణ్య’ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా, ‘నంది’ అవార్డు గ్రహీత, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, టాలీవుడ్ టైమ్స్ చీఫ్-ఎడిటర్ ఎం.డి అబ్దుల్, శ్రీయుతులు ప్రముఖ న్యాయవాది నాగుల శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ప్రతాపరెడ్డి, కొర్రపాటి సురేష్, ఆర్. రాజేష్, ఎమ్మార్వో జి. శంకర్, రాజు వస్తాద్, డి. సర్వయ్య, బి. రాములు, శ్రీనివాస్, డి. సంపత్ కుమార్, నికనార్, దామోదర్ తదితరులు హాజరై నూతన వధూవరులైన సబిత – సాయికుమార్ లను ఆశీర్వదించి అభినందనలు అందజేశారు.

Related posts

Leave a Comment