ఏమాత్రం తీరిక దొరికినా దాన్నే ఆశ్రయిస్తా!

ShrutiHaasan
Spread the love

థానాయిక శృతిహాసన్‌ సంగీతాభిరుచి గురించి అందరికి తెలిసిందే. స్వర రచనతో పాటు సొంత గళాన్ని వినిపిస్తూ.. ఈ సుందరి కొన్ని ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ రూపొందించి సత్తాచాటుకుంది. నటన, సంగీతం, గానంలో ప్రతిభను చాటుతూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఈ భామ పేరు తెచ్చుకుంది. సంగీతం మన మానసిక శక్తుల్ని పునరుత్తేజం చేసే ఓ దివ్యౌషదమని శృతిహాసన్‌ చెప్పింది… ‘ఏమాత్రం తీరిక దొరికినా సంగీతాన్ని ఆశ్రయిస్తా. మనసులోని ఆందోళనలన్నింటిని మటుమాయం చేసే శక్తి సంగీతానికి ఉంది. ఒకానొక సమయంలో నేను తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యాను. మనసంతా ఒత్తిళ్లతో నిండిపోయి ఉండేది. ఏం చేయాలో తోచేది కాదు. అప్పుడు సంగీతం నాకు ఓదార్పునిచ్చింది. నేను సాధారణ స్థితికి చేరుకోవడానికి దోహదపడింది. భవిష్యత్తులో కూడా నా సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తా’ అని చెప్పుకొచ్చింది.

Related posts

Leave a Comment