ఏం జరుగుతోంది ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ పాలనలో?

Spread the love

– తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు ఆవేదన

– దళిత బిడ్డకు కన్నీటి వీడ్కోలు

టాలీవుడ్ టైమ్స్ న్యూస్ –
ఏం జరుగుతోంది ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ పాలనలో? డబ్బుల మూటలు, భూ-కబ్జాలు ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. నిలువెల్లా దోపిడీ, దగా ఈ ప్రభుత్వానికి ఏ విషయంలోనూ చిత్తశుద్ధి లేదు అని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి దళిత బిడ్డ ఆత్మహత్య ఎంత దారుణమైన ఘటన. దళితులు, పేదవాళ్ళు ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనా? ఉన్నత చదువులు చదవాలి అనుకున్న తన ఆశలు చంపుకొని తల్లిదండ్రుల భాధ చూడలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంట ఒక సమస్య నెలకొంది అని సునీతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు ఆధ్వర్యంలో మహిళా సభ్యులు రేపు అనగా 21 న ఆత్మహత్య చేసుకున్న లావణ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, ధనలక్ష్మి, రేణుక, వరలక్ష్మి, సుజాత, మస్రత్ గాంధి సిరాజ్ ఇందిర, అనిత శ్రీమతి జమున తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment