ఈ నెల 19న థియేటర్ లలో ‘మిస్సింగ్’ విడుదల

Missing-movie-pressmeet
Spread the love

హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “మిస్సింగ్”. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. “మిస్సింగ్” చిత్రంతో శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మిస్సింగ్” చిత్రం ఈనెల 19న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో…
హీరోయిన్ నికీషా రంగ్వాలా మాట్లాడుతూ…మిస్సింగ్ మూవీలో మిస్ అయ్యేది నేనే. కాబట్టి ఈ నెల 19న ప్రేక్షకులు అందరూ నన్నే వెతుకుతారు అనుకుంటున్నాను. ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. మిస్సింగ్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు నా క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. అన్నారు.
హీరో హర్షా నర్రా మాట్లాడుతూ… “మిస్సింగ్” సినిమాను ప్రమోట్ చేసేందుకు చాలాసార్లు వచ్చిన మీడియాకు థాంక్స్. మా సినిమా థియేటర్ ఎక్సీపిరియన్స్ కోసమే తెరకెక్కించాం. అందుకే ఓటీటీ ఆఫర్స్ ఎన్ని వచ్చినా థియేటర్ రిలీజ్ కే మొగ్గు చూపాం. అంతా కొత్తవాళ్లం చేసిన ప్రయత్నమిది. తప్పకుండా మీకు నచ్చేలా ఉంటుంది. థియేటర్ లలో ఈనెల 19న విడుదల చేసేందుకు రెడీ అయ్యాం. థియేటర్ లోనే ఎందుకు అంటే, మిస్సింగ్ మూవీని థియేటర్ లో చూసే ఎక్సీపిరియన్స్ వేరుగా ఉంటుంది. మా సినిమాలోని విజువల్స్, సౌండింగ్, మేకింగ్ థియేటర్స్ కే కరెక్ట్. మంచి థ్రిల్లర్ మూవీ చేశాం. ఫ్యామిలీ అంతా చూసేలా సినిమా ఉంటుంది. అన్నారు.
దర్శకుడు శ్రీని జోస్యుల మాట్లాడుతూ…అంతా కొత్త వాళ్లం కలిసి చేసిన చిత్రమిది. కొత్త వాళ్లను ఆదరించడంలో మన ప్రేక్షకులు ముందుంటారు. మిస్సింగ్ చిత్రంతో మేము చేసిన ప్రయత్నాన్ని కూడా రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. మా మూవీలో ఎక్కడా వల్గారిటీ ఉండదు. మంచి థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ ఇచ్చే చిత్రమిది. మీకు నచ్చితే పది మందికి చెప్పండి. లేకుంటే మాకు చెప్పండి, లోపాలు ఉంటే కరెక్ట్ చేసుకుంటాం. వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఉండాలన్నదే మా కోరిక. ఈ నెల 19న థియేటర్ లలో మిస్సింగ్ చూసి ఆదరించండి. అన్నారు.
సూర్య, ఛత్రపతి శేఖర్, రామ్ దత్, విష్ణు విహారి, అశోక్ వర్థన్, వినోద్ నువ్వుల తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం – వశిష్ఠ శర్మ, కిట్టు విస్సాప్రగడ, శ్రీని జోస్యుల, మేకప్ – వెంకటేష్ బాల, కాస్ట్యూమ్స్ – టీఎస్ రావు, ప్రొడక్షన్ డిజైనర్ – దీక్ష రెడ్డి, కాస్ట్యూమ్స్ డిజైనర్ : శ్రుతి కిరణ్, ఆర్ట్ – దార రమేష్ బాబు, పైట్స్ – పి. సతీష్, డాన్స్ – బంగర్రాజు, జీతు, స్టిల్స్ – గుంటూరు రవి, ప్రొడక్షన్ కంట్రోలర్ – బి సి చౌదరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సాయి కె కిరణ్, ఎడిటర్- సత్య జి, సంగీతం – అజయ్ అరసాడ, సినిమాటోగ్రఫీ – జనా. డి, పీఆర్వో – జీఎస్ కె మీడియా, నిర్మాతలు – భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు నర్రా, కథా మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం – శ్రీని జోస్యుల.

Related posts

Leave a Comment