ధర్మ సంస్థాపన, లోకకల్యాణం కోసం ఎన్నో కష్టాలకోర్చిన శ్రీ సీతారాములు మనందరికీ ఆదర్శం
ఆ ఆదర్శమూర్తుల చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలి
అనంత విశ్వంలో సుమధుర పదం శ్రీరామ నామం
శ్రీరామనవమి పర్వదినాన నకిరేకల్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ మాజీ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం
శ్రీరామనవమి పర్వదినాన నకిరేకల్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో మాజీ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు పూజలు నిర్వహించారు. మెదటగా నార్కటపల్లి పట్టణంలోని SC కాలనీలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో, నకిరేకల్ పట్టణంలోని శివాలయం నందు మరియు వెంకటేశ్వర ఆలయం నందు, మున్సిపాలిటీ పరిధిలోని 08వ వార్డులో, 09వ వార్డులోని అభయఅంజనేయ స్వామి ఆలయ నందు 11వ వార్డు నందు మరియు నకిరేకల్ మండలం మంగలపల్లి గ్రామంలో జరిగిన సీతారాముల కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….అనంత విశ్వంలో సుమధుర పదం శ్రీరామ నామం అని ఆయన అన్నారు.సీతారాముల విశిష్టతను ఆయన కొనియాడారు. సీతారాముల పవిత్రబంధం భావితరాలకు ఆదర్శమని, శ్రీ రామచంద్రుడి పాలన ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఆ సీతారాముల ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. సత్యమార్గాన్ని అనుసరిస్తూ తండ్రి ఆదేశాన్ని పాటించిన రాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు. పద్నాలుగేండ్ల పాటు అడవుల్లో ఉన్న తర్వాత అయోధ్య చేరుకున్నాడు. అప్పుడు జరిగిన శ్రీరామ పట్టాభిషేకం చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని భక్తులు భావిస్తారు. శ్రీ సీతారాముల కల్యాణం జరిగింది కూడా ఇదే రోజే కావడం విశేషం. అందుకే శ్రీరామ నవమి నాడు ఎంతో వైభవంగా సీతారాముల కల్యాణం జరుపుతారు అన్ని అన్నారు. అనంతరం వివిధ దేవాలయాల్లో వారిని సన్మానించి, స్వామి వారి తీర్దప్రసాదలు అందజేశారు.