ఆలేరు పట్టణంలో రోడ్డు పక్కన పొంచి ఉన్న ప్రమాదం

Spread the love

టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి – ఆలేరు
ఆలేరు పట్టణం లోని కొలనుపాక రోడ్డు నుండి దుర్గామాత గుడి వరకు ప్రధాన రహదారిని కలిపే బైపాస్ రోడ్డును ఇటీవలే విస్తరించారు,దీని ప్రక్కనే వ్యవసాయ బావికి ఎలాంటి రక్షణ హెచ్చరిక బోర్డులు లేకపోవడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నవని బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బందెల సుభాష్ సోమవారం ఒక ప్రకటన లో ఆవేదన వ్యక్తం చేశారు పట్టణం లో రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ నిర్మాణం అసంపూర్తిగా నిలిచి పోవడం మరియు పట్టణం లోని ఆర్ ఓ బీ చుట్టూ దూరంగా ఉండడం తో ఇటు సిద్దిపేట కొలనుపాక అటు హైదరాబాద్, వరంగల్ రహదారులకు ఇరువైపులా రాకపోకలు సాగించే ఆర్ టీ సి బస్సులు, ప్రయివేట్ వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహన చోదకులతో ఈ రహదారి రద్దిగా మారింది ఈ దారి ప్రక్కనే బుజలింగం వ్యవసాయ క్షేత్రం దగ్గర లక్ష్మి నర్సింహ డిగ్రీ కళాశాల ఎదురుగా ప్రమాదకరంగా బావి ఉన్నది దీనికి ఎలాంటి రక్షణ గోడ కానీ ఫెన్సింగ్ కానీ లేవు వాహనాలు నడిపేవారికి ఈ ప్రాంతం లో ఎదురుగా ఏదైనా వాహనాలు, జంతువులు వచ్చినప్పుడు వాటిని తప్పించే ప్రయత్నం లో అక్కడ ఉన్న బావిని గుర్తించక అందులో పడి ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి కావున తక్షణమే ఆ ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు మరియు ఆ బావికి అనుసంధానంగా పటిష్టమైన గోడను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా వాహనదారులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు

Related posts

Leave a Comment