దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మీడియా రంగానికి అలుపెరుగకుండా సేవలందించి, నేటి తరం జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచిన సీనియర్ పాత్రికేయులు కే.రామచంద్రమూర్తి గారు 75ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో శనివారం రాత్రి సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, ఎమెస్కో సంస్థలు మాదాపూర్ లోని దష్పల హోటల్ లో నిర్వహించిన “అక్షరానికి అమృతోత్సవం” ఆత్మీయ కార్యక్రమం కనుల పండగల జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి మీడియా, రాజకీయ, సామాజిక రంగాల నుండి పలువురు ప్రముఖులు హాజరై మూర్తి గారికి శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయత పంచుకున్నారు. ఏపీ మాజీ సీఎస్ కాకి మాధవ రావు, సిపిఐ నేత నారాయణ, సిపిఎం నేత రాఘవులు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కేంద్ర ఆర్టీఐ మాజీ కమీషనర్ మాడబుషి శ్రీధర్, కాంగ్రేస్ పార్టీ నాయకులు కే.వి.పి.రామచందర్ రావు, బీజేపీ నాయకులు రామచందర్ రావు, ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, సీఎం చీఫ్ పీఆర్ఓ జ్వాల నర్సింహారావు, ప్రముఖ సినీదర్శకులు బి.నర్సింగరావు, బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ ఓఎస్డీ మల్లెపల్లి లక్ష్మయ్య, టీఎస్పీఎస్సి మాజీ చైర్మన్ గంటా చక్రపాణి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్, నమస్తే తెలంగాణ ఎడిటర్ తీగుళ్ల కృష్ణమూర్తి, ఐ న్యూస్ సిఇఓ ఏ.కె.సాగర్, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ, తెలంగాణ మేగజైన్ ఎడిటర్ అష్టకాల రామ్మోహన్ శర్మ, సీనియర్ పాత్రికేయులు బండారు శ్రీనివాస్ రావు, తెలకపల్లి రవి, వీక్షణం వేణు, వనజ, పసునూరి శ్రీధర్ బాబు, సైదారెడ్డి, మ్యాడం మధు, రవీందర్ శేషు, మా శర్మ, వేణు, ఆవుల శ్రీనివాస్, రాము, జమీల్, చక్రపాణి తదితరులు హాజయ్యారు.
Related posts
-
WANTED TEACHERS FOR THE USA
Spread the love WANTED TEACHERS FOR THE USA -
అత్యంత వైభవంగా సౌధామినీ వివాహం
Spread the love దూడల శ్రీనివాస్ గంగాధర్ ప్రధమ పుత్రిక చి!!.ల!!సౌ!! సౌధామినీ వివాహం చి!! శివ కుమార్ (శ్రీ స్వామి గౌడ్... -
బాణా సంచా ధరల మోత : ధరలతో కళతప్పుతున పండగలు!
Spread the love by -షేక్ వహీద్ పాషా, సీనియర్ జర్నలిస్ట్ -9848787917 ధరల నేపథ్యంలో పండగలకు కళ తప్పింది. అన్ని...