అడివి శేష్ పాన్ ఇండియా చిత్రం మేజర్ సెన్సార్ పూర్తి.. U/A సర్టిఫికేట్

Versatile hero Adivi Sesh is promoting his ambitious Pan India project Major like never before. The film, in the meantime, completed censor formalities and it has been awarded with U/A certificate. The film’s total duration is 149 minutes.
Spread the love

వెర్సటైల్ హీరో అడివి శేష్ తన ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మేజర్‌’ను మునుపెన్నడూ లేని విధంగా ప్రమోట్ చేస్తున్నారు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ చిత్రానికి U/A సర్టిఫికేట్‌ ఇచ్చింది. సినిమా మొత్తం నిడివి 149 నిమిషాలు.
మేజర్ చిత్రం కంటెంట్, భావోద్వేగాలు సెన్సార్ బోర్డ్ సభ్యులని ఆకట్టుకున్నాయి. మేజర్ ఫస్ట్ హాఫ్ లో సందీప్ పర్శనల్ లైఫ్, తల్లిదండ్రులతో వున్న అనుబంధం, ఇషాతో చిన్ననాటి ప్రేమని మెస్మరైజ్ గా చూపించారు.
సెకండ్ హాఫ్ లో భారీ యాక్షన్, హై అండ్ ఎమోషనల్ మూమెంట్స్‌తో ప్రేక్షకులు చూపుతిప్పుకోలేనంత గొప్ప అనుభవాన్ని మేజర్ చిత్రం అందిస్తుంది. భారీ నిర్మాణ విలువలు, నటీనటులు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ మేజర్ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ.
అడివి శేష్ తన అద్భుతమైన నటనతో కొన్ని సన్నీవేషాలు కోసం స్కూల్స్ డేస్ లోకి కూడా చక్కగా ట్రాన్సఫర్మేషన్ కావడం అద్భుతం అనిపిస్తుంది.
భారీ అంచనాలతో మేజర్ జూన్ 3వ తేదీన సినిమా థియేటర్లలోకి రానుంది, ఇదే సమయంలో ముందుగానే ‘మేజర్’ చిత్రం ప్రివ్యూలు దేశవ్యాప్తంగా ప్రదర్శించబడుతున్నాయి

Related posts

Leave a Comment