ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డాక్టర్ రాజశేఖర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలో సినీ ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు రాజశేఖర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఇదే కార్యక్రమంలో తను నటించిన 91 వ సినిమా” శేఖర్” చిత్రంలోని “కిన్నెర” సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది.ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు..పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.విడుదలైన కిన్నెర సాంగ్ కు ప్రేక్షకులనుండి హ్యుజ్ రెస్పాన్స్ వస్తుంది.
సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఇచ్చిన
ఓ..సన్నజాజి తీగలా.. అల్లుకోవే నన్నిలా కిన్నెరా.. ఓ..కిన్నెరా..
సంకురాrత్రి పంటలా.. పంచుకోవే నన్నిలా..కిన్నెరా.. ఓ..కిన్నెరా..
అనే పాట వినసొంపుగా ఉంది.
సాంగ్ లాంచ్ అనంతరం చిత్ర హీరో రాజశేఖర్ మాట్లాడుతూ.. కోవిడ్ ఈ టైం లో నేను బతుకుతానా లేదా అనిపించింది. ఇక నా జీవితం అయిపోయింది నేను సినిమాలు చేస్తానా లేదా.. అనుకున్నాను.ఎందుకంటే నేను హాస్పిటల్లో లేవలేక నడవలేక చాలా వరెస్టు స్విచ్వేషన్ లో ఉన్నాను. అయితే ఈ రోజు నేను మీ ముందు నిలుచున్నాను అంటే మీ అందరూ బ్లెస్సింగ్స్ వల్లే నేను బయటపడ్డాను. వారందరికీ నా ధన్యవాదాలు. నేను కోలుకున్న తరువాత ఈ “శేఖర్” సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాకు నేను ఎంత కష్టపడ్డాము అంటే..10 సినిమాలు చేసినంత కష్టం ఈ సినిమాకు కష్టపడ్డాను. అందరం ఈ సినిమాకు ప్రాణం పెట్టి తీశాము. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం జీవిత .తను మా వెనుకుండి నడిపించింది. దాని ఫలితం ఈ సినిమాలో కనిపిస్తుంది. మీరందరూ ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకురాలు జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ…ఈ శేఖర్ సినిమా మాకు మరిచిపోలేని సినిమా అవుతుంది. ఎందుకంటే శేఖర్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు రాజశేఖర్ గారికి కోవిడ్ వచ్చింది. దాంతో మేము బర్త్ డే కూడా జరుపుకోలేదు. తనకు సినిమా అంటే పిచ్చి ఎప్పుడూ సినిమా గురించే డిస్కస్ చేస్తుంటాడు.ఈ శేఖర్ సినిమా పూర్తి కావడానికి ఆర్టిస్టులకు,టెక్నిసిషన్స్ ఎంతో సపోర్ట్ చేశారు వారందరికీ నా ధన్యవాదాలు. సినిమా కంప్లీట్ అయ్యింది.తన బర్త్ డే రోజు కిన్నెర సాంగ్ ను రిలీజ్ చేసుకొని ఈ సినిమా రిలీజ్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.. రాజశేఖర్ ఆరోగ్యంగా ఉండాలని ఎంతో మంది రాజశేఖర్ గారి ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫాన్స్ ఇలా అందరూ పూజలు చేశారని విన్నాను. వారందరికీ నా ధన్యవాదాలు. 30 సంవత్సరాలు గా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ప్రేమించే.. అభిమానించే మిమ్మల్ని మా ముందు వుంచినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా నిర్మాతలు శ్రీనివాస రావు,మురళీకృష్ణ, సుధాకర్ రెడ్డి గార్లు ఔట్ ఆఫ్ స్టేషన్ లో ఉండడం వలన వారు రాలేకపోయారు. వారు అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేసి అండగా నిలబడ్డారు వారికి నా ధన్యవాదాలు అన్నారు.మా సినిమా పాటలన్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.మేము రిలీజ్ చేసిన మొదటి పాట పెఫండ హిట్ అయ్యింది. సెకండ్ సాంగ్ “కిన్నెర” కు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమాను ఎంతో కష్టపడి, ఇష్టంగా చేశాము. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయింది రెండు రోజుల్లో ఫస్ట్ కాపీ కూడా వస్తుంది.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ…మంచి కాన్సెప్ట్ తో హార్ట్ టచింగ్ అయ్యే మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నాము.ఇలాంటి మంచి సినిమాలో నేను పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.
తన బర్త్ డే సందర్భంగా స్పెషల్ గా ఈరోజు రెండో సాంగ్ రిలీజ్ చేసుకుంటున్నాము.జీవిత గారు నన్ను ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకున్నారు.త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.
రాజశేఖర్ కూతురు నటి శివాని మాట్లాడుతూ.. మొదటగా మా డాడీకి జన్మదిన శుభాకాంక్షలు.ఈ సినిమా ద్వారా నాకు ప్లస్ అవుతుంది అన్నారు నన్ను మా డాడీ. అది నాకు పెద్ద బ్లెస్సింగ్.జనరల్ గా మా అమ్మ నాన్న లే నాకు ప్లస్. అనూప్ సర్ ఈ సినిమాలో చాలా బాగున్నావ్ అని చెప్పడం జరిగింది దానికి కారణం మా మమ్మీ డైరెక్ట్ చేయడం వలనే..
లవ్ గంట తరువాత విడుదలైన కిన్నెర పాటకు ప్రేక్షకులనుండి హ్యుజ్ రెస్పాన్స్ వస్తుంది.ఇలాగా ఈ సినిమాలో పాటలన్నిటినీ కూడా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను..నన్ను అందరూ ఓటిటి స్టార్ అంటూ..
ఈ సినిమా థియేటర్స్ లలో రిలీజ్ అవుతుందా అని చాలా మంది అడుగుతున్నారు.త్వరలో మీ అందరి ముందుకు థియేటర్లో ఈ సినిమా వస్తుంది ఎందుకంటే.. నా ఫస్ట్ థియేటర్ మూవీ ఇది.నన్ను మా సినిమాను ఆదరించి పెద్ద హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
నటుడు సమీర్ మాట్లాడుతూ.. నేను ఇప్పటివరకు ఏ హీరోతో ఇంత లాంగ్ లెన్త్ రోల్ చేయలేదు. నా కెరీర్లో ఎంతో ఎంజాయ్ చేసిన సినిమా ఇది. జీవిత గారు చాలా స్వీట్ పర్సన్ తనే ఏ టు జెడ్ అన్నీ దగ్గరుండి చూసుకుంది.తన వర్క్ ఏంటో ఈ సినిమా ద్వారా కనిపిస్తుంది.ఇప్పటి వరకు నేను చూసిన రాజశేఖర్ గారి న సినిమాలలో కల్లా ఈ సినిమా బెస్ట్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు.తన కంప్లీట్ యాక్టింగ్ ఇందులో కనిపిస్తుంది.
ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మరియు మాధవ్ గారు మాట్లాడుతూ ..
రాజశేఖర్ గారికి హ్యాపీ బర్త్ డే. వారి బర్త్ డే సందర్భంగా “కిన్నెరా” సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది.ఇంతకుముందు రిలీజ్ అయిన సాంగ్ కు పోటీగా విడుదలైన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇలాగే మిగతా సాంగ్స్ కూడా రిలీజ్ అయి మంచి ప్రాచుర్యం పొంది సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుతున్నాము
నటుడు భరణి శంకర్ గారు మాట్లాడుతూ.. మా బర్త్ డే బాయ్ హీరో రాజశేఖర్ కు జన్మదిన శుభాకాంక్షలు.నేను రాజశేఖర్ గారితో చేయడం ఇది నా ఫస్ట్ మూవీ. అనూప్ గారు తన పాటలతో సినిమాకు ప్రాణం పోశారు.అన్ని పాటలు చాలా అల్టిమేట్ గా ఉన్నాయి. స్క్రీన్ మీద మీకు మేం చేసిన అల్లరి చూసి చాలా ఎంజాయ్ చేస్తారు.నాకు,సమీర్,రవివర్మ గారికి జీవిత గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు.ఇలాంటి మంచి ఛాన్స్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. అందరూ థియేటర్ కు వచ్చి మా సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుతున్నాను అన్నారు.
నటుడు రవి వర్మ మాట్లాడుతూ.. హీరో గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇందులో రాజశేఖర్ గారి గెటప్ చాలా అద్భుతంగా ఉంటుంది. నా కెరీర్లో ఇంత ఎంజాయ్ చేసిన సినిమా ఇదే అవుతుంది. జీవిత గారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ మమ్మల్ని బాగా చాలా బాగా చూసుకున్నారు.ఇది రెగ్యులర్ సినిమాలా ఉండదు రాజశేఖర్ గారికి బెస్ట్ సినిమా అవుతుంది.ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను
ఇంకా ఈ కార్యక్రమంలో మాట్లాడిన వారంతా ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు
రాజశేఖర్, ఆత్మీయ రజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ పార్ట్నర్: టికెట్ ఫ్యాక్టరీ, కళ: సంపత్, రైటర్: లక్ష్మీ భూపాల, ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: వంకాయలపాటి మురళీక్రిష్ణ, నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జీవితా రాజశేఖర్.