అందుకే.. ఈ బ్యూటీకి డేటింగ్‌పై నమ్మకం లేదట!

kiyara
Spread the love

కొత్తతరం అమ్మాయినైనా ప్రేమ విషయంలో ఆధునిక భావాల్ని వంటపట్టించుకోనని.. ప్రేమ, పెళ్లి విషయాల్లో తన ఆలోచనా విధానం పూర్తి సంప్రదాయికంగా ఉంటుందని చెప్పింది కియారా అద్వాణీ. ఆమె కథానాయికగా చేసిన హిందీ తాజా చిత్రం ‘ఇందూ కి జవానీ’. డేటింగ్‌ యాప్స్‌ నేపథ్యంలో నేటితరం యువతీయువకుల ఆలోచనారీతుల్ని చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా కియారా అద్వాణీ మాట్లాడుతూ .. తనకు డేటింగ్‌పై అస్సలు నమ్మకం లేదని చెప్పింది. డేటింగ్‌ యాప్స్‌ సంస్కృతిని నేను ఇష్టపడను. పాతకాలంలో మాదిరిగా స్వచ్ఛమైన, నిజాయితీతో కూడిన ప్రేమపట్ల నాకు విశ్వాసం ఉంది. ప్రేమ విషయంలో నేను పాత ఆచారాల్ని నమ్ముతాను. మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడి జీవితాంతం అతనితో కలిసి ఉండాలనుకుంటా’ అని చెప్పుకొచ్చింది కియారా అద్వాణీ. బాలీవుడ్‌తోపాటు ఇటు దక్షిణాదిన కూడా గుర్తింపు దక్కించుకున్న కథానాయిక కియారా ఆడ్వాణీ. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కియార తన కెరీర్ ఆరంభ రోజుల గురించి మాట్లాడింది…తన తొలి సినిమా తీవ్ర నిరాశను కలిగించిందని, తనకు రెండో అవకాశం వస్తుందని కూడా ఊహించలేదని తాజాగా కియార ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది… “చాలా మంది నా తొలి సినిమాధోనీ అనుకుంటారు. అది నిజం కాదు. నా తొలి సినిమా 2014లో వచ్చిన ఫగ్లీ. ఆ సినిమా ఫ్లాపై నా ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది. నాకు రెండో అవకాశం వస్తుందని కూడా అనుకోలేదు. నా కెరీర్ అయిపోయినట్టేనని నిరాశలో కూరుకుపోయా. ఆ తర్వాత ఎన్నో ఆడిషన్లు ఇచ్చాను. చివరికి ధోనీ అవకాశం వచ్చింది. ఆ సినిమాతో దేశమంతా పరిచయమయ్యాన`ని కియార చెప్పింది.

Related posts

Leave a Comment