అలీ నటించిన ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ చిత్రానికి సంబంధించి సెన్సార్ పార్ట్ పూర్తయింది.. యు (U) సర్టిఫికేట్ ని సెన్సార్ బోర్డు ప్రకటించింది. మంచి సందేశాత్మక చిత్రమని చిత్రాన్ని తిలకించిన బోర్డు సభ్యులు ప్రశంసించారు. టాలీవుడ్ కమెడియన్ అలీ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీనటుడు అలీ దశాద్ధాలుగా తనకంటూ ప్రత్యేక మార్క్ సృష్టించుకుంటున్నాడు. హీరోగా నటిచించిన సినిమాల్లో యమలీల వంటి చిత్రాలు హిట్స్ తెచ్చిపెట్టాయి. తనదైన కామెడీ శైలీని పండించడంలో ఆయనకు సాటి మరేవరు లేరు. అలా ప్రేక్షకులకు ఓ రేంజ్‌లో కితకితలు పెట్టిన ఆలీ.. హీరోగా కూడా సత్తా చాటారు. అంతటితో ఆగక బుల్లితెరపై కూడా ప్రత్యేక షోలతో దూసుకుపోతున్నారు. ఇక అలీ నిర్మాతగా మారి ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ అనే మూవీ రూపొందిస్తున్నారు. మలయాళంలో సూపర్ సక్సెస్ సాధించిన వికృతి మూవీ ఆధారంగా ఈ ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ చిత్రం రూపొందుతోంది. అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అలీ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీపురం కిరణ్ దర్శకుడు. అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ సెన్సార్ పూర్తి – యు (U) సర్టిఫికెట్: మంచి సందేశాత్మక చిత్రమని బోర్డు సభ్యులు ప్రశంస
