సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ సింగిల్ కళావతి సాంగ్ టాలీవుడ్ ఫాస్టెస్ట్ 150 మిలియన్ వ్యూస్ ఫస్ట్ సింగల్ గా సరికొత్త రికార్డ్

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Single Kalaavathi Clocks Fastest 150 Million Views Record
Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Single Kalaavathi Clocks Fastest 150 Million Views Record
Spread the love

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ కంపోజ్ చేసిన ‘సర్కారు వారి పాట’ ఆల్బమ్ ఇప్పటికే మ్యాజిక్ ని క్రియేట్ చేసింది. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ కళావతి పాట మెలోడీ అఫ్ ది ఇయర్ గా నిలిచింది. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే 100 మిల్లియన్ల వ్యూస్ సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించిన కళావతి పాట ఇప్పుడు టాలీవుడ్ ఫాస్టెస్ట్ 150 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి అరుదైన రికార్డ్ నెలకొల్పింది. అలాగే 1.9 మిలియన్స్ కు పైగా లైక్స్ సొంతం చేసుకుంది.
కళావతి పాట ఇంటర్నెట్ సెన్సేషన్ గా నిలవడమే కాకుండా వివిధ ఆడియో స్ట్రీమింగ్ వేదికలు, యాప్స్ లో టాప్ సాంగ్ లిస్టు లో కొనసాగుతుంది. యుట్యూబ్ లో కూడా ట్రెండింగ్ వీడియోస్ లో చాలా రోజుల పాటు అగ్రస్థానంలో కొనసాగింది. ఈ పాటలో మహేష్ బాబు క్లాసీ డ్యాన్సులు ఫ్యాన్స్ ని ఫిదా చేశాయి. అనంత శ్రీరామ్ కళావతి పాటకు ఆకట్టుకునే సాహిత్యం అందించగా సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు.
కళావతి పాటతో పాటు పెన్నీ, సర్కారు వారి టైటిల్ సాంగ్స్ కూడా ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే సర్కారు వారి పాట నుంచి మాస్ సాంగ్ విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఆర్ మధి సినిమాటోగ్రాఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
‘సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.