‘లైగర్’ కోసం విజయ్, పూరి నయా ప్లాన్ ఇదే.

'liger' kosam hero vijay devarakonda-director puri plan edhe..!
'liger' kosam hero vijay devarakonda-director puri plan edhe..!
Spread the love

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్నపాన్ ఇండియా మూవీ లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్ లైన్.
కరోనా కారణంగా థియేటర్లు మూతపడడం.. షూటింగులు ఆగిపోవడం తెలిసిందే. లాక్ డౌన్ ఎత్తేయడంతో థియేటర్లు ఓపెన్ కావడం.. షూటింగులు స్టార్ట్ కావడం జరిగింది. అయితే.. ఆగిపోయిన సినిమాల షూటింగ్ మొదలయ్యాయి కానీ.. లైగర్ షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు. స్పీడుగా సినిమాలు తీసే పూరి ఇలా స్లో అయిపోయాడేంటి అనుకుంటున్నారు సినీ జనాలు.
అయితే.. ఇంకా లైగర్ షూటింగ్ తిరిగి స్టార్ట్ చేయకపోవడం కారణం ఏంటంటే.. వందల మంది జూనీయర్ ఆర్టిస్టులతో చేయాల్సిన సీన్స్ ఉన్నాయట. అలాగే మైక్ టైసన్ తో కొన్ని సీన్స్ చిత్రీకరించాలి. ఆయన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలిసింది. అయితే.. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడా అని లైగర్ అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే.. లైగర్ టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో జోష్ నింపాలని పూరి టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే హీరో విజయ్ దేవరకొండ టీజర్ కి డబ్బింగ్ చెబుతున్నాడని సమాచారం.
తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లు తెలియచేశారు. యువర్ బాయ్ ఈజ్ బ్యాక్ – వర్క్ ఫ్రమ్ హోమ్.. లెట్స్ గెట్ థింగ్స్ మూవీంగ్ అని విజయ్ ట్వీట్ చేస్తూ.. ఓ ఫోటోని షేర్ చేశాడు. ఇందులో ఆయన మైక్ ముందు నిలబడి ఒక చేతిలో కాఫీ కప్ పట్టుకొని.. మరో చేతిలో డైలాగ్ పేపర్ పట్టుకొని చదువుతూ కనిపించాడు. దాంతో ఇది గ్యారెంటీగా లైగర్ టీజర్ కోసమే.. అంటున్నారు అభిమానులు. పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు. మరి.. టీజర్ లో షూటింగ్ గురించి.. అలాగే మూవీ రిలీజ్ గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.