తొమ్మిది భావోద్వేగాలు, తొమ్మిది దృక్కోణాలు, తొమ్మిది కథలు.. వీటి సమాహారంగా ప్రముఖ డిజిటల్ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 6న విడుదలవుతున్నఅంథాలజీ నవరస. ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను మంగళవారం (జూలై 27) నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. భారతీయ సినిమాలో లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం, సీనియర్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర పంచపకేశన్ ఈ అంథాలజీని రూపొందించారు. మానవ జీవితంలోని తొమ్మిది రసాలు(భావోద్వేగాలు).. ప్రేమ, హాస్యం, కోపం, దుఃఖం, ధైర్యం, భయం, జుగుప్స, ఆశ్చర్యపోవడం, శాంతి కలయికతో.. తమిళ సినిమాకు సంబంధించిన అద్భుతమైన క్రియేటివ్ పర్సన్స్ అందరూ ఇండియన్ సినీ ఎంటర్టైన్మెంట్లో లార్జర్ దేన్ లైఫ్ మూమెంట్ ఈ అంథాలజీని రూపొందించారు.
అద్భుతమైన సృజనాత్మక నైపుణ్యం, ప్రతిభల కలయికతో వస్తున్న అంథాలజీ నవరస
పాండమిక్ సమయంలో ఇబ్బందులు పడ్డ తమిళ సినిమా కార్మికుల కోసం ఆపన్న హస్తం అందించడానికి రూపొందిచబడినది. అరవిందసామి, బిజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్, కార్తీక్ నరేన్, ప్రియదర్శన్, రతీంద్రన్ ఆర్.ప్రసాద్, ఎస్.అర్జున్ వసంత్ ఎస్.సాయి వంటి తొమ్మిది మంది గొప్ప దర్శకులు.. ప్రతి రసానికి(భావోద్వేగం) ప్రాణం పోయడానికి కలిసి కట్టుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. జస్ట్ టికెట్స్ బ్యానర్ నిర్మాణంలో మణిరత్నం, జయేంద్ర పంచపకేశన్ సహ నిర్మాతలుగా ఈ నవరస
అంథాలజీ రూపొందించబడింది. ఆగస్ట్ 6న నెట్‌ఫ్లిక్స్‌లో 190 దేశాల్లో విడుదలవుతుంది.
ఈ సందర్భంగా మణిరత్నం, జయేంద్ర పంచపకేశన్ మాట్లాడుతూ భావోద్వేగాలు క్షణికమైనవే కావచ్చు. అయితే అవి మన జీవితాంతం గుర్తుండిపోతాయి. భావోద్వేగాలు మన జీవితంలో ఓ భాగం. కొన్ని భావోద్వేగాలు అయితే మన గమనాన్నే మార్చేస్తాయి. ఇలాంటి భావోద్వేగాలతో రూపొందిన `నవరస` మనలో ఆసక్తిని కలిగిస్తుంది. సాధారణంగా మన జీవితంలో ఎన్నో భావోద్వేగాలున్నప్పటికీ ప్రధానంగా ఓ ఎమోషన్ మన మనస్సు, ఆత్మను స్వాధీనంలోకి తెచ్చుకుని మన చర్యల ద్వారా బహిర్గతమవుతుంటాయి. అలాంటి తొమ్మిది భావోద్వేగాల నుంచి పుట్టిన తొమ్మిది కథల కలయికే `నవరస`. క్షణిక కాలంలో కొన్నిసార్లు ఇలాంటి భావోద్వేగాలు కీలకంగా వ్యవహరిస్తాయి. మరికొన్ని లోతుల్లోకి చేరి ఓ ఆకృతిని సంతరించుకుంటాయి. అలాంటి ఎమోషన్స్ గురించి చెప్పేదే `నవరస`. ఈ తొమ్మిది రసాలు(భావోద్వేగాలు) నుంచి తొమ్మిది కథలను ఎంగేజింగ్‌గా రూపొందించడానికి కారణమైన సినీ ఇండస్ట్రీలోని మా సహచరులు, దర్శకులు, నటీనటులు, సాంకేతికనిపుణులతో భాగమైనందుకు ఆనందంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ తొమ్మిది రసాల సంగమాన్ని చూసి ఆనందిస్తారని భావిస్తున్నాం
అన్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 6న ప్రసారం కాబోతున్న నవరస
చూసిన ప్రేక్షకులే..ఎవరూ వినని, చూడని సరికొత్త కథలకు ప్రత్యక్ష సాక్షులు కాబోతున్నారు.
నిర్మాతలు: జస్ట్ టికెట్స్, మణిరత్నం, జయేంద్ర పంచపకేశన్
అంథాలజీ స్టోరి 1: – ఎదిరి(కరుణ)
డైరెక్టర్ – బిజోయ్ నంబియార్
నటీనటులు – విజయ్ సేతుపతి, ప్రకాశ్‌రాజ్, రేవతి
అంథాలజీ స్టోరి 2: – సమ్మర్ ఆఫ్ 92(హాస్యం)
డైరెక్టర్ – ప్రియదర్శన్
నటీనటులు – యోగిబాబు, రమ్య నంబీశన్, నెడుమూడి వేణు
అంథాలజీ స్టోరి 3: ప్రాజెక్ట్ అగ్ని(అద్భుతం)
డైరెక్టర్ – కార్తిక్ నరేన్
నటీనటులు – అరవందస్వామి, ప్రసన్న, పూర్ణ
అంథాలజీ స్టోరి 4: పాయాసం(భీభత్స).. అసహ్యం
డైరెక్టర్ – వసంత్ ఎస్ సాయి
నటీనటులు – డిల్లీ గణేశ్, రోహిణి, అదితి బాలన్, సెల్ఫీ కార్తీక్
అంథాలజీ స్టోరి 5: పీస్(శాంతి)
డైరెక్టర్ – కార్తీక్ సుబ్బరాజ్
నటీనటులు – బాబీ సింహ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మాస్టర్ తరుణ్
అంథాలజీ స్టోరి 6: రౌద్రం(కోపం)
డైరెక్టర్ – అరవింద్ సామి
నటీనటులు – రిత్విక, శ్రీరామ్, అభినయ శ్రీ, రమేశ్ తిలక్, గీతా కైలాసం
అంథాలజీ స్టోరి 7: ఇన్మయ్(భయం)
డైరెక్టర్ – రతీంద్రన్ ఆర్.ప్రసాద్
నటీనటులు – సిద్ధార్థ్, పార్వతీ తిరువోతు
అంథాలజీ స్టోరి 8: తునింత పిన్(ధైర్యం)
డైరెక్టర్ – ఎస్ ఆర్జున్
నటీనటులు – అథర్వ, అంజలి, కిశోర్
అంథాలజీ స్టోరి 9: గిటార్ కంబి మేల్ నిండ్రు(ప్రేమ)
డైరెక్టర్ – గౌతమ్ వాసుదేవ్ మీనన్
నటీనటులు – సూర్య, ప్రయాగ రోస్ మార్టిన్
నెట్‌ఫ్లిక్స్ గురించి..
డిజిటల్ రంగంలో వరల్డ్ నెంబర్ వన్‌గా రాణిస్తోన్న నెట్‌ఫ్లిక్స్‌కు 208 మిలియన్స్ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 190 దేశాలకు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు.. ఇలా డిఫరెంట్ జోనర్స్ కంటెంట్‌తో పలు భాషల్లో ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది నెట్‌ఫ్లిక్స్. వీక్షకులు(సబ్స్క్రైబర్స్) ఎక్కడ నుంచి, ఎంత వరకు అయినా, ఎలాంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌లో అయినా ఎంజాయ్ చేయవచ్చు. సభ్యులు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడటం, కావాలంటే వారు చూస్తున్న షోను కావాల్సినంత సేపు ఆపుకోవడం మళ్లీ కావాలంటే ఆపేసిన చోట నుంచే వీక్షించవచ్చు. ఇలా చేసే సమయంలో ఎలాంటి కమర్షియల్ యాడ్స్, డిస్ట్రెబన్స్ ఉండవు. నెట్‌ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్కు సంబంధించి లేటెస్ట్ న్యూస్, అప్డేట్స్ IG@Netflix_IN, TW@Netflixindia TW South@Netflix_INSouth and FB@NetflixIndiaలను ఫాలోకండి.
జస్ట్‌టికెట్స్ గురించి…
షార్ట్ ఫిలింస్ అంథాలజీగా రూపొందిన ‘నవరస’ను మణిరత్నం జయేంద్ర పంచపకేశన్(కో ఫౌండర్ క్యూబ్ సినిమా)లు రూపొందించారు. కొవిడ్ 19 కారణంగా ఎఫెక్ట్ అయిన సినీ పరిశ్రమలోని వారి కోసం ఈ అంథాలజీని రూపొందించారు. ఈ ప్రాజెక్ట్‌ను జస్ట్ టికెట్స్ బ్యానర్.. ఏపీ ఇంటర్నేషనల్, వైడ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా, వారి సహకారంతో రూపొందించింది. ప్రో బోనోగా ఈ అంథాలజీలో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు వారి సేవలను అందించారు. అందుకు కారణం..సినీ పరిశ్రమకు తమవంతుగా సహకారం అందించడమే.