మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కోసం ఫిలిం ఛాంబర్ ప్రాంగణ స్థలాన్ని ఉపయోగించుకోవాలి : తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్

anilkumar news
Spread the love

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కోసం ఫిలిం ఛాంబర్ ప్రాంగణ స్థలాన్ని ఉపయోగించుకోవాలని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ అన్నారు. ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో ఉన్న రామానాయుడు కళ్యాణమండపం ముందు ప్రాంతంలో హైరైజ్ బిల్డింగ్ కట్టుకోవచ్చని, ఆ బిల్డింగ్ లో మా అసోసియేషన్ ఆఫీస్ తో పాటు 24 క్రాఫ్టుల కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చని అనిల్ కుమార్ సూచించారు. ఇలా చేస్తే మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా ఒక చోట ఉన్నట్లు అవుతుందని ఆయన చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో హీరోలు, పెద్దలంతా కలిసి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటే మా అసోసియేషన్ తో పాటు ఇతర అసోసియేషన్ ల బిల్డింగ్ ల సమస్య తీరుతుందని వల్లభనేని అనిల్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఇండస్ట్రీకి పెద్ద దిక్కులాంటి మెగాస్టార్ చిరంజీవి గారు ముందుకు రావాలని అనిల్ కుమార్ కోరారు. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిత్రపురి కాలనీలోని ఎల్ ఐజీ ప్రాంగణంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, కమిటీ సభ్యులు తెలిపారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమానికి హీరో శ్రీకాంత్ అతిథిగా హాజరవుతారని ఆయన అన్నారు.

Related posts

Leave a Comment