అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులని అలరించిన నూతన దర్శకుడు గంగాధర వై కె అద్వైత దర్శకత్వం లో రూపొందిన ” సురభి 70 ఎం ఎం ” సినిమా ఈ నెల 18 వ తేదీన థియేటర్స్ లో విడుదల కానుంది. “సురభి 70 ఎం ఎం హిట్టు బొమ్మ ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, సినిమా అనేది ప్రతి తెలుగువాడి నరనరాల్లో ఉన్న ఎమోషన్ , సినిమా థియేటర్ ని కాపాడుకోవాలి అనే ఒక మంచి కథతో గ్రామీణ నేపధ్యం లో పూర్తి సహజమైన పాత్రలతో తెరకెక్కించిన సురభి 70 ఎం ఎం సినిమా లో ప్రేమ కథలు , ఫామిలీ కథలు ఉన్నాయ్ అని సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధం అయింది” అని చిత్ర దర్శకుడు గంగాధర్ వై కె అద్వైత అన్నారు. ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి గారి ట్రిబ్యూట్ సాంగ్ ఐన “చిట్టి చిట్టి కన్నుల్లో ” అనే పాట మెగాస్టార్ చిరంజీవి గారి వరకు చేరి సురభి 70 ఎం ఎం టీం ని అభినందించడం కూడా జరిగింది. బాబీ ఫిలిమ్స్ , జె ఎస్ ఆర్ పిక్చర్స్ సంయుక్తన్గా నిర్మించిన ఈ సినిమా ని కె కె చైతన్య ప్రొడ్యూస్ చేసారు . అక్షత శ్రీనివాస్ , వినోద్ , అనిల్ , చందు , మహేష్ ,ఉషాంజలి ,శ్లోక , యోగి ఖత్రి, అనీష్ రామ్, సూర్య ఆకొండి ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రానికి డెన్నిస్ నార్టన్ సంగీతాన్ని అందించారు . టెక్నికల్ టీమ్: సమర్పణ :బాబీ ఫిలిమ్స్, సినిమాటోగ్రఫీ: శేఖర్ , గోపాల్ ఎస్ ఎస్ వి , భరత్ సి కుమార్, ఎడిటర్ : నాగిరెడ్డి , కంజర్ల యాదగిరి, మ్యూజిక్: డెన్నిస్ నార్టన్, సహా నిర్మాత : శేషి రెడ్డి జంగా, నిర్మాత: కె కె చైతన్య , రచన-దర్శకత్వం: గంగాధర వై కె అద్వైత
Related posts
-
W/O అనిర్వేష్ చిత్ర బృందాన్ని అభినందించిన హీరో అల్లరి నరేష్.
Spread the love గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర... -
Hero Allari Naresh Congratulates the Team of W/O Anirvesh
Spread the love Under the banner of Gajendra Productions by Venkateswarlu Merugu, Sri Shyam Gajendra, presented by... -
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ...