ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీ. o .ఎం.ఎస్.నంబర్ 35 నందు…సినిమా టిక్కెట్లు ను ఆన్లైన్ ద్వారా అమ్మకం చేయుటకు ఒక నిర్ణయం తీసుకొని గవర్నర్ రాజముద్ర తో ఒక జీ. ఓ.ను విడుదల చేయటం జరిగింది..ఆ జీ. ఓ.నందు ఒక బ్లూ ప్రింట్ ను విడుదల చేసేoదుకు ఒక కమిటీ ని కూడా నిర్ణయించడం జరిగింది.. ఈ ఆన్లైన్ టికెట్స్ అమ్మే నిర్వహణ ను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అభివృద్ధి సంస్థ నిర్వహించనున్నట్టు తెలిపారు… కానీ నిన్న మంత్రి పేర్ని నాని ఈ సినిమా టిక్కెట్స్ ఆన్లైన్ అమ్మకాల పై ఒక నిర్ణయం ఇంకా తీసుకోలేదని …ఒక కమిటీ వేసినట్లు తెలిపారు….ప్రభుత్వ జీ. ఓ.కీ మంత్రి ప్రకటన కు పొంతన లేకుండా ఉందని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటన లో మంత్రి ప్రకటన పై స్పందించారు…
ఆయన ఆ ప్రకటన లో ” మంత్రి కి సంభంధం లేకుండా ఈ జీ. ఓ.ను ప్రభుత్వం విడుదల చేసింద అని ప్రశ్నించారు ? జీ. ఓ.లో చాలా స్పష్టతగా నిర్ణయం తీసుకొన్నట్టు తెలుపుతుందని …నిర్వహణ తదితర అంశాల పై ఒక నిర్ణయం తీసుకొనుటకు ఒక చైర్మన్ తో పాటు సభ్యులను నిర్ణయించిన తర్వాత ఇప్పుడు మంత్రి ఈ ప్రకటన చిత్ర పరిశ్రమ ని గందరగోళ పరిస్థితుల్లో కి నీట్టిందని.. ప్రభుత్వలు ప్రజల బాగు కోసం పనిచేయలే కానీ ఎవ్వరో కొంత మంది వేక్తుల కోసం కాదని…ఈ ఆన్లైన్ టిక్కెట్ అమ్మకం వలన అటు ప్రజలకు.పరిశ్రమ కు ప్రభుత్వం నీకి ఏంతో మేలని ఒక పక్క మంత్రి తన మాటల్లో చైపుతూనే ..ఇంకా నిర్ణయం ..2002 నుండి జరిగిన పరిమాణలను తెలిపారు.. అప్పుడు ఆన్లైన్ ట్రేడింగ్ అంత వాడుకలో లేదని . ప్రస్తుతం అది ఎక్కువ వాడుక లో ఉందని..ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్శించు పక్కనున్న రాష్ట్ర ల సిని పీద్ద లు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ లను కూడా ఈ ఆన్లైన్ టిక్కెటింగ్ విధానం కొరకు డిమాండ్ చేస్తున్నరని.
ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ పోర్టల్లో మాత్రమే విక్రయించా లనుకుంటు తీసుకొన్న నిర్ణయం గొప్పదని.పరిశ్రమ అభివృద్ధి కి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందన్న విషయాన్నీ మంత్రి గమనించలనీ ఈ ఆన్లైన్ అమ్మకాల పై ఇబ్బందులు ఉంటే కొంతమంది హీరోలకు మాత్రమే కాదని అందరూ హీరోలకు వర్తిస్తుందని ఇది ప్రజా దోపిడీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొన్న సాహసోపేత నిర్ణయమని, నిర్ణయం వెనుకకు తీసుకోవలను కోవటం ఎవ్వరి కోసమో.. ఆన్లైన్ లో సినిమా టికెట్స్ అమ్మకం వలన విచ్చల విడి బ్లాక్ మార్కటింగ్.టాక్స్ లు కట్టకుండా ఉండే తతంగం, ఇష్ట రాజ్యము గా సినిమా లను ప్రదర్శిo చు కోవటనికి గండి పడుతుందని, పీద్ద హీరోల చిత్రలను చూడలనుకొనే సగటు పీక్షకుడు అధిక ధరలను చైల్లించి సినిమాలు చూడవలసిన అవసరం ఇక ఉండదని,
హీరో ల పారితోషికం భారిగా తగ్గుటకు.నిర్మాణ ఖర్చులు భారీగా తగ్గుటకు.. ఈ నిర్ణయం పరిశ్రమ మేలుకు ఉపయోగ పడుతుందని… చిత్ర నిర్మాణాలు కూడా పెరుగుటకు అవకాశం ఉంటుందని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మంత్రి తన ప్రకటన ను మార్చుకోవాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు .