సెన్సేషనల్ సినిమాలతో రోజురోజుకీ తన స్థాయి పెంచుకుంటుంది జీ 5 సంస్థ. ఇప్పటికే ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో పాటు ఆసక్తికరమైన సినిమాలను నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది జీ5. తాజాగా మరో ఆసక్తికరమైన చిత్రాన్ని ఎక్స్‌క్లూజివ్‌గా జీ 5లో విడుదల చేయనున్నారు. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన కిన్నెరసాని సినిమా హక్కులను జీ 5 సొంతం చేసుకున్నారు. జూన్ 10న ఈ సినిమాను నేరుగా ఓటిటిలో విడుదల చేయనున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కిన్నెరసాని జీ5లో నేరుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. వేద అనే అమ్మాయి.. తన తండ్రి కోసం వెతకడం చుట్టూనే ఈ సినిమా కథ అంతా తిరుగుతుంది. అన్ శీతల్, కాశిష్ ఖాన్ హీరోయిన్లుగా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రవీంద్ర విజయ్ విలన్‌గా నటించారు. మరో కీలక పాత్రలో మహతి బిక్షు నటించారు. రమణ తేజ ఈ థ్రిల్లర్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. సాయి తేజ దేహరాజ్ ఆత్రేయస ఈ సినిమాకు కథ అందించారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ బలంగా చెప్తున్నారు.
నటీనటులు:
కళ్యాణ్ దేవ్, అన్ శీతల్, కాశిష్ ఖాన్,. రవీంద్ర విజయ్, మహతి బిక్షు తదితరులు.
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: రమణ తేజ
నిర్మాత: రామ్ ప్రసాద్ తళ్లూరి
రైటర్: సాయి తేజ దేహరాజ్ ఆత్రేయస
ఎడిటర్: అన్వర్ అలీ
లిరిసిస్ట్: కిట్టు విస్సాప్రగడ
బ్యానర్: SRT ఎంటర్టైన్మెంట్స్.