నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ శ్రీ శక్తి గణపతి పూజా కార్యక్రమం

aler news
Spread the love

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని ఆదర్శనగర్ లో శ్రీ శ్రీ శక్తి గణపతి వద్ద పూజా కార్యక్రమం ఇన్చార్జి కో-ఆర్డినేటర్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఇన్చార్జి కో-ఆర్డినేటర్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి మాట్లాడూతూ… నవరాత్రులు భక్తుల విశేష పూజలందుకున్న గణనాథుడు.. ఆదివారం గంగమ్మ ఒడికి చేరాడు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. విభిన్న రూపాల వినాయకుల శోభాయాత్ర.. భక్తుల భజనలు, కోలాటాలు, నృత్యాలతో ఘనంగా సాగింది. ఈ నవరాత్రుల్లో గణపతి వద్ద భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం నిర్వహించిన ప్రతిఒక్కరినీ నీలం పద్మ వెంకటస్వామి అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని కరోనా మహమ్మారి నుండి ప్రజలందరు విముక్తులు కావాలని శ్రీ శక్తి గణపతిని పూజించడం జరిగిందని వివరించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో అనురాధ, ఝాన్సీ, మంజుల, భారతి, యశోద, సురేఖ, కళ్యాణి, రాధా, రాకేశ్, సాయి తేజ, బి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment