నవీన్ బెత్తిగంటి, దివ్య శ్రీపాద ‘చరిత కామాక్షి’ సినిమా నుంచి ‘ది వరల్డ్ ఆఫ్ చరిత కామాక్షి’ విడుదల..

HBD Divya Sripada from Team Charitha Kamakshi
HBD Divya Sripada from Team Charitha Kamakshi
Spread the love

ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్ పై రజినీ రెడ్డి నిర్మాతగా చందు సాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘చరిత కామాక్షి’. నవీన్ బెత్తిగంటి, దివ్య శ్రీపాద జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో దివ్య శ్రీపాద టైటిల్ రోల్ చరిత కామాక్షి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా దివ్య శ్రీపాద పుట్టినరోజు సందర్భంగా ది వరల్డ్ ఆఫ్ చరిత కామాక్షి విడుదలైంది. చక్కటి చీరకట్టులో.. గృహిణి పాత్రలో.. చూడగానే గౌరవం ఉట్టిపడే విధంగా ఈ పాటలో కనిపిస్తున్నారు హీరో హీరోయిన్లు. చిరునవ్వుతో ఎంతో అందంగా కనిపిస్తున్నారు దివ్య శ్రీపాద. అబూ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కోడాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్. రాకీ వనమాలి సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.
నటీనటులు:
నవీన్ బెత్తిగంటి, దివ్య శ్రీపాద.
టెక్నికల్ టీం:
దర్శకుడు: చందు సాయి
నిర్మాత: రజిని రెడ్డి
నిర్మాణ సంస్థ: ఫైర్ ఫ్లై ఆర్ట్స్
ఎడిటర్: కోడాటి పవన్ కళ్యాణ్
సినిమాటోగ్రఫీ: రాకీ వనమాలి
సంగీతం: అబూ
PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్