తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబర్స్ కీ నట్టి కుమార్ చేస్తున్న విజ్ఞప్తి

Spread the love

గౌరవ సోదర సోదరీమణులైన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబర్స్ ప్రతీ ఒక్కరికీ నట్టి కుమార్ చేస్తున్న విజ్ఞప్తి….
ఫిబ్రవరి 19న జరగబోయే కౌన్సిల్ ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ జాయింట్ సెక్రటరీగా నేను పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటును నాకు వేయవలసిందిగా మనవి చిన్న సినిమాలను తీస్తున్న నిర్మాతలందరికీ నేను విన్నవిస్తున్నది ఏమనగా! ఎవరు కౌన్సిల్ ను నిలబెట్టారో మరొక్కసారి ఆలోచించండి. గిల్డ్ నుంచి వచ్చి పోటీ చేస్తున్న నిర్మాతలకు అసలు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో తేల్చుకోవాలని నా విన్నపం. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో పోటీ చేస్తున్న గిల్డ్ నిర్మాతలు… వీటిని అమలు పరుస్తామంటూ రేపు అనగా శనివారం రాత్రి 8 గంటలలోగా స్పష్టంగా హామీ ప్రకటన ఇవ్వాలి1). చిన్న సినిమాల అభివృద్ధి కోసం క్యూబ్, యు,.ఎఫ్.ఓ చార్జీలు ఇప్పుడు అమలులో ఉన్న వాటిలో 30 శాతం తగ్గించాలి. 2) సభ్యులందరికీ 7 లక్షల రూపాయల మెడిక్లయిమ్ పాలసీని అందజేయాలి3) ఎవరైనా సభ్యుడు మరణిస్తే, ఆ సభ్యుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల సాయాన్ని అందించాలి4) గిల్డ్ దగ్గర ఉన్న నిధులను ఖర్చు పెట్టి మూవీ టవర్స్-2 కోసం ల్యాండ్ ను కొనుగోలు చేసి, కాస్ట్ టు కాస్ట్ తో .సభ్యులకు నివాసగృహాలను కట్టించి ఇవ్వాలికౌన్సిల్ లో పోటీ చేస్తున్న గిల్డ్ నిర్మాతలకు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్స్ లోపే శనివారం రాత్రి 8 గంటల లోపు పైన పేర్కొన్న న్యాయబద్ధమైన హామీలను అమలుపరుస్తామంటూ తమ సమ్మతిని ప్రకటించాలి. అప్పుడు ఎవరికి ఓటు వేయాలో విజ్ఞులైన ఓటర్లు నిర్ణయించుకుంటారు
మీ నట్టి కుమార్

Video link

Video link

Video link

Related posts

Leave a Comment