ప్రతి నటుడి జీవితాన్ని ఓ శుక్రవారం మారుస్తుంది… నా జీవితాన్ని ‘మంగళవారం’ మార్చింది : సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో ప్రియదర్శి న్యూఏజ్ ఫిలింమేకర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ నటించిన సినిమా ‘మంగళవారం’. నవంబర్ 17న పాన్ ఇండియా రిలీజ్ చేశారు. అజయ్ భూపతికి చెందిన ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామ్యంతో ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ నిర్మించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమాలో మాస్క్ వెనుక ఉన్నది ఎవరు? అని విడుదలకు ముందు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగింది. విడుదలైన తర్వాత చూసిన ప్రేక్షకులు సైతం ఆ ట్విస్ట్ రివీల్ చేయలేదు. ఇవాళ మాస్క్ వెనుక ఉన్న నటుడు, మాలచ్చిమ్మ పాత్రలో నటించిన ప్రియదర్శి…