SPARK Telugu Movie Review in Telugu: సరికొత్త అనుభూతిని పంచే ‘స్పార్క్’

SPARK Telugu Movie Review in Telugu:

(చిత్రం: స్పార్క్, నటీనటులు : రేటింగ్ : 3.5/5, విక్రాంత్ రెడ్డి , మెహరీన్ కౌర్ పిర్జాదా, రుక్సార్ ధిల్లాన్, వెన్నెల కిశోర్, నాజర్, సుహాసిని, సత్య, అన్నపూర్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. దర్శకత్వం : డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్, నిర్మాత : లీలా రెడ్డి, సంగీత : హేషమ్ అబ్దుల్ వాహాబ్ , సినిమాటోగ్రఫీ : ఏ.ఆర్.అశోక్ కుమార్). ఈ దీపావళి కానుకగా అనేక చిత్రాలు థియేటర్లలోకి అడుగుపెట్టాయి. అలా విడుదలైన సినిమాలేవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా సందడి చేసింది లేదు. ఫలితంగా రాబోయే సినిమాల మీద ప్రేక్షకులు దృష్టిసారించారు. అలా ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తడానికి ఈ వారం ‘స్పార్క్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం విడుదలకు ముందే వచ్చిన పాటలకి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ‘ఏం…