స‌త్య‌దేవ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ లాక్డ్‌ సీజ‌న్ 2తో ప్రేక్ష‌కుల‌కు మ‌రోసారి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న ‘ఆహా’

aha's blockbuster show Locked starring Satyadev Kancharana returns for season two
aha's blockbuster show Locked starring Satyadev Kancharana returns for season two
Spread the love

హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో బ్లాక్‌బ‌స్ట‌ర్ సర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ సిరీస్ లాక్డ్‌ రెండో సీజ‌న్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. వైద్య‌శాస్త్రంలో క‌ఠిన‌త‌ర‌మైన ఎన్నో కేసుల‌కు ప‌రిష్కారాల‌ను సూచించిన గొప్ప న్యూరో స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ఆనంద్ పాత్ర‌లో మెప్పించ‌డానికి స‌త్య‌దేవ్ కంచ‌ర‌న మ‌రోసారి సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే అత‌ని పేరు ప్ర‌తిష్టల‌ను నాశ‌నం చేయ‌గ‌ల ఓ ర‌హ‌స్యాన్ని ఈ ప్ర‌పంచానికి తెలియ‌కుండా దాచేస్తాడు. లాక్డ్‌ సీజ‌న్ 1ను డైరెక్ట్ చేసిన ప్ర‌దీప్ దేవ కుమార్ సీజ‌న్‌ను కూడా డైరెక్ట్ చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నున్న ఈ లాక్డ్ సీజ‌న్ 2లో ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేసే అంశాలెన్నో ఉంటాయి.
లాక్డ్‌ సీజ‌న్ 1లో చిన్న చిన్న దొంగ‌త‌నాలు చేసే ముగ్గురు దొంగ‌లు డాక్ట‌ర్ ఆనంద్ ఇంట్లోకి ప్ర‌వేశిస్తారు. అక్క‌డ వారికి ఆనంద్ జీవితంలోని చీక‌టి కోణం గురించి తెలుస్తుంది. ఆ ఇంట్లోకి ప్ర‌వేశించే ఎంతో మంది నిమిషాల్లో హ‌త‌మ‌వుతుంటారు. స‌త్య‌దేవ్‌, సంయుక్తా హెగ్డే, కేశ‌వ్ దీప‌క్‌, శ్రీల‌క్ష్మి, బిందు చంద్ర‌మౌళి త‌దిత‌రులు న‌టించిన తొలి సీజ‌న్ ప్రేక్ష‌కుల‌కు ప‌లు ట్విస్టులు, ట‌ర్న్స్‌తో ప్రేక్ష‌కులు ఓ ఉత్కంఠ‌త‌కు లోన‌య్యారు. కథ ప‌రంగా, స్కేల్‌, విజ‌న్ ప‌రంగానే కాకుండాలాక్డ్ రెండో సీజ‌న్ వెన్నులో ఓ భ‌యాన్ని క‌లిగించేంత ఎలిమెంట్స్‌తో తెలుగు మాధ్య‌మాల్లో మేకింగ్ స్టాండ‌ర్స్ ప‌రంగానూ స‌రికొత్త అర్థాన్ని చెప్పేలా ఉండ‌బోతుంది.