సంస్కృతిని ప్రభావితం చేసే అసమానమైన శక్తి సినిమాకి ఉంది. ప్రజలను ప్రభావితం చేసే అపారమైన శక్తి సైతం చలనచిత్రాలకే ఉందంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. కానీ నేడు ఏం జరుగుతోంది? డబ్బు సంపాదించడానికి, బాధ్యతా రహితమైన హింసాత్మక చర్యలను చూపించే సినిమాలు థియేటర్లో అడుగుపెడుతూ ప్రజల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి. యువతరం చెడు మార్గాల్లో పయనించడానికి ఉసి గొల్పుతున్నాయి. ఒక చిత్రం బాగుందనుకుంటే.. మరో పది నాసిరకం సినిమాలు వెలుగు చూస్తూ వెండితెరను వెక్కిరిస్తున్నాయి.. దర్శకుడు ఒక సినిమా చేసే వరకు దానికి ఎంత అంకితభావం అవసరమో.. ఆ సినిమా చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందో నేడు అతడికే సరిగా తెలియడంలేదు. ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల మన సినిమాలు ఎల్లలు దాటుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే మనవాళ్లు జాగ్రత్తతో అడుగులు వేయాలి. ఇక రచయితల విషయానికొస్తే.. సాహిత్యం, చరిత్ర, మానవ కథలలో కథనం.. దానికి సంబంధించి భావం, చరిత్ర కథనం; సాహిత్యం స్పష్టంగా పాత్రలను ప్రదర్శించడం, వారి జీవితాల నుండి సంఘటనలను ఎంచుకోవడం.. ప్రేరణలను పొందడం ఉత్తమ రచయితల లక్ష్యం కావాలి. మన చరిత్రకారులు అదే ఆవశ్యకతతో రాసి గొప్ప నవలా రచయితలుగా, సినీ రచయితలుగా పేరుగడించిన విషయం మనం గు ర్తుంచుకోవాలి. ఇలాంటి తరుణంలోనే మరో నవయువ రచయిత వెండితెరపై వెలుగులు విరజిమ్మాలని.. సినీ రచయితగా తన చిరకాల ఆశను నెరవేర్చుకోవాలని ఈ వెండితెర ‘కల’ల బాటసారి ఉవ్విళ్లూరుతున్నాడు… ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు…అతడే వెంకట్ కొమ్మోజు.
”ఒక చిన్న ప్లాట్ ఫామ్ నుండి వెండితెర దాకా చేసే సినిమా కి మొదటి సోల్ కథ… తర్వాత దాన్ని నడిపించే కథనం… అందరూ ఫ్రీ గా వర్క్ చేస్తే మంచి సినిమా తీయొచ్చు అనుకోవడం మన అజ్ఞానం… ఎందుకంటే ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే మంచి సినిమా వస్తుంది. పాత్ర వేసే వాడికి రెమ్యూనరేషన్ … పాత్ర రాసేవాడికి? చిత్రించే కెమెరాకి రెంట్… కానీ ఆ చిత్రాన్ని తన విజన్ తో అందంగా తేసేవాడికి? ఇలా కొన్ని క్రాఫ్ట్స్ ఫ్రీ గా రావాలి అనుకుంటే విజయం కూడా ఆలస్యం గానే వస్తుంది. కంటెంట్ లేని క్వాలిటీ లేని సినిమా మనం చూసుకోడానికి పని చేస్తుంది… దాని వల్ల స్థాయి పెరగదు” అంటాడు నవ యువతరం సినీ రచయిత వెంకట్ కొమ్మోజు. కసి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అని నమ్మే ఇతగాడి వద్ద ఎన్నో కథలు ఉన్నాయి. అవన్నీ వైవిధ్యంతో కూడుకున్న కొత్త కాన్సెప్ట్ కథలే అని చెబుతున్నాడు. షార్ట్ ఫిలిం, వెబ్-సీరీస్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్, ఫీచర్ ఫిలిమ్స్.. ఎలా ఒకటేమిటి ఎన్నో..ఎన్నెన్నో మనసులను ఆహ్లాద పరిచే కథలేనట!
నూతనంగా వస్తున్న రచయిత వెంకట్ కొమ్మోజు మొదటి వెబ్ సిరీస్ – సంగమం. ఈ వెబ్ సిరీస్ ను మినీ థియేటర్ మీడియాలో హర్ష అల్లం దర్శకత్వంలో నందన్ స్టూడియోస్ వారు నిర్మించారు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయాలకొస్తే.. లీల లీక్స్ (వెబ్-సిరీస్), సైలెన్స్ (వెబ్-సిరీస్), ది స్ట్రేంజర్ (డెమో), పరిచయం (డెమో). ఇవీ కాక ప్రస్తుతం మూడు థియేటర్ చిత్రాలకు రచయిత గా పని చేస్తున్నాడు. థియేటర్ మూవీస్ : మాక్ కింగ్స్ ప్రొడక్షన్ సంబంధించి రెండు చిత్రాలు, వరంగల్ కు చెందిన మరో బ్యానర్ లో ఒకటి.. వీటితో పాటు ఇంకా కొన్ని పెద్ద చిత్రాలు చర్చల్లో ఉన్నాయంటున్నాడు వెంకట్. తన కెరీర్ ని ‘మినీ థియేటర్ మీడియా’ ద్వారా ప్రారంభించడం చాలా ఆనందం గా ఉందని చెబుతున్నాడు.
ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం, రాయవరం కు చెందిన కొమ్మోజు వెంకటేశ్వర రావు అలియాస్ వెంకట్ కొమ్మోజు రచయిత గా తన ప్రయాణం 2017 లో చిన్న చిన్న లఘు చిత్రాలతో ప్రారంభించి ప్రస్తుతం వెండితెర చిత్రాలకు రచయితగా మారి తన కలల్ని నెరవేర్చుకునే బాటలో అవిశ్రాంతంగా కృషిచేస్తున్నాడు. ”తన ప్రయాణానికి మొదలు ‘మినీ థియోటర్ మీడియా’ సంస్థ అధినేత రమణ రాజు గారి సహకారంతోనే ఇంత వరకు వచ్చాను. అదే సంస్థ నుండి తన మొదటి వెబ్ సిరీస్ ” సంగమం” వచ్చింది. దాని దర్శకుడు హర్ష అల్లం కూడా తన కథకి పూర్తి న్యాయం చేశారు. ఈ సంస్థ తోనే ఇంకా మూడు వెబ్ సిరీస్ సైన్ చేశా” అని చెప్పుకొచ్చాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని కూడా ఈ సందర్భంగా తన మనసులోని మాటను వ్యక్తం చేశాడు. ఇక థియేటర్ చిత్రాలకు అహ్మద్ ఖాన్ గారి ప్రొడక్షన్ “Mak kings ” లో రెండు చిత్రాలకు రచయిత గా సైన్ చేశా అని, వరంగల్ నుండి నూతనంగా వస్తున్న కొత్త టీమ్ కి కూడా రచయిత గా వర్క్ చేస్తున్నా అని చెప్పాడు. ఇటీవల విడుదల అయిన ‘సంగమం’ వెబ్ సిరీస్ మంచి ఆదరణ తో ముందుకు వెళ్లడం ఆనందంగా ఉందన్నాడు..
ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు, ఆ తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ మీడియట్ (వర్క్ చేస్తూ) పూర్తి చేసి, డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో డిస్కoటిన్యూ చేసిన తర్వాత మార్కెటింగ్ లో ఐదుసంవత్సరాలు, కరూర్ వైశ్యా బ్యాంక్ లో ఆఫ్ రోల్ జాబ్ రెండు సంవత్సరాలు చేసి , ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఆన్ రోల్ జాబ్ ఆరు నెలలు చేసినప్పటికీ.. తనకి మొదటి నుండి రచన మీద ఆసక్తి ఉండడంతో దాని కోసం టెన్త్ తర్వాత నుండి చిన్న చిన్న వాటికి రాసి తర్వాత అది కుదరక పోవడం తో జాబ్ రిజైన్ చేసి 2017 లో హైదరాబాద్ వచ్చి తన ప్రయత్నాల్ని ప్రారంభించిన వెంకట్ కొమ్మోజు ఇప్పుడు ఆరు ప్రాజెక్ట్స్ తో ముందుకు సాగుతున్నాడు. తనకి మొదట అవకాశం ఇచ్చిన ” మినీ థియేటర్ మీడియా” రమణ రాజు పెరిచర్ల , దర్శకుడు హర్ష అల్లం కి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ నా జర్నీలో తన భార్య వైష్ణవి సహకారం ఎంతో ఉందని, అలాగే తన తల్లిదండ్రులు కూడా నా సినీ ప్రయాణానికి పూర్తి తోడ్పాటును అందించారని ఎంతో ఆనందంగా చెబుతున్న సినీ రచయిత వెంకట్ కొమ్మోజు సెల్ నెంబర్ ఇది: 8008952084. తనను కలవాలనుకునే వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెబుతున్నాడు.
”చాలా మంది ప్రొఫెషనల్ స్క్రీన్ రచయితలు తమ స్క్రీన్‌ప్లే రాయడం ప్రారంభించే ముందు అవుట్‌లైన్‌ను రూపొందించాలని సిఫార్సు చేస్తున్నారు. స్క్రీన్ రైటింగ్ కెరీర్ అభివృద్ధి చెందుతున్నప్పుడు, ప్రాజెక్ట్ రాయడం ప్రారంభించే ముందు నిర్మాతలు లేదా నిర్మాణ సంస్థ, స్టూడియో ఎగ్జిక్యూటివ్‌లకు అవుట్‌లైన్ అందించమని కూడా అడగవచ్చు. చాలా మంది పరిశ్రమ నిపుణులు స్క్రీన్ రైటింగ్ నిజమైన పని చాలా వరకు అవుట్‌లైన్‌లో జరుగుతుందని చెబుతారు. అయితే ఒక రూపురేఖలు సరిగ్గా ఏమిటి ? దానిని రూపొందించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం ఏమిటి? అనేది ఆలోచిస్తే.. అవుట్‌లైన్ అనేది స్క్రీన్‌ప్లే యొక్క మొత్తం కథకు సంబంధించి సన్నివేశం వారీగా విచ్ఛిన్నం. ఒక రూపురేఖలు రచయితకు అవసరమైనంత వివరంగా ఉండవచ్చు: ఇది కథా మూలకాలకు సంబంధించి సాధారణ విచ్ఛిన్నం కావచ్చు లేదా యాక్షన్, సంభాషణల పంక్తులతో సహా మరింత సమగ్రంగా ఉండవచ్చు. సాధారణ నియమం ఏమిటంటే, రూపురేఖలు ఎంత వివరంగా ఉంటే, స్క్రీన్‌ప్లే రాయడానికి సమయం వచ్చినప్పుడు అది బాగా ఉపయోగపడుతుంది. అవుట్‌లైన్‌లో సీన్ బ్రేక్‌డౌన్, యాక్షన్, డైలాగ్ ఉంటే, అది ప్రతి సీన్‌ను వీలైనంత మెరుగ్గా చేయడంపై దృష్టి పెట్టడానికి అనుమతిస్తుంది. స్క్రీన్‌ప్లే వాస్తవిక రచన సులభంగా, మరింత ప్రభావవంతమైన ప్రక్రియగా మారుతుంది. అసలు స్క్రీన్‌ప్లే రాయడం లేదా మళ్లీ రాయడం వంటి ఒత్తిడి లేకుండా కథలో కావలసినన్ని మార్పులు చేయవచ్చు. ఆలోచనతో ఆడుకోవచ్చు. చురుకైన డైలాగ్ రాయడం లేదా కారు ఛేజ్‌ను వివరించడానికి ఉత్తేజకరమైన మార్గాన్ని కనుగొనడం వంటి అదనపు ఒత్తిడి లేకుండా ప్లాట్ పాయింట్లను సరిగ్గా రూపొందించుకోవచ్చు. అవుట్‌లైన్‌లో ఏదైనా పని చేయకపోతే, ఇప్పటికే మొత్తం స్క్రీన్‌ప్లేను వ్రాసిన దానికంటే ఈ సమయంలో దాన్ని సరిచేయడానికి తక్కువ సమయం, శక్తి ఉంటుంది. రచయిత, నిర్మాత, నిర్మాణ సంస్థ లేదా స్టూడియో అవసరాలను బట్టి రూపురేఖలు వివిధ పొడవులలో ఉంటాయి. రూపురేఖలు వేసేటప్పుడు రూపురేఖలను కొంచెం క్లుప్తంగా ఉంచుకోవచ్చు, సుమారు 10 పేజీలు. అయితే, మీరు స్టూడియో కోసం ఫీచర్ ఫిల్మ్‌ని వివరిస్తున్నట్లయితే, మరింత సమాచారం జోడించబడినందున అవుట్‌లైన్ 40 పేజీల వరకు రన్ అవుతుంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని జాబితా చేయడం.. ప్రతి సన్నివేశానికి వీలైనంత ఎక్కువ వివరాలను పూరించడం స్క్రీన్‌ప్లేను వివరించే ఒక ప్రసిద్ధ పద్ధతి” అంటూ తాను నేర్చుకున్న సినీ రచనాశైలికి ఇవే మార్గాలంటూ చెప్పుకొచ్చాడు వెంకట్.
”సినిమా ‘కల’ల ప్రపంచం..
ఎన్నో ‘కళ’ల సమూహం..
జీవితం ఒక నాటకరంగం..
అందులో నీ పాత్ర రాసేది బ్రహ్మ (రచయిత)..
నిన్ను నడిపించేది దేవుడు (దర్శకుడు)..
సహకరించేది నీ స్నేహితులు (టెక్నీకల్ టీమ్)..
వీటన్నిటినీ ఒకే చోట చేర్చేది డబ్బు (నిర్మాత)..
ఇక ఈ నాటకానికి అంతిమ తీర్పు ఇచ్చేది నీ శ్రేయోభిలాషులు (ప్రేక్షకులు)
ఇది ఒక సినిమా వాడి కథ..
మీ కథ..
సినిమా కథ…”
-అంటాడు వెంకట్ కొమ్మోజు.
కొత్త కంటెంట్ తో.. కొత్త రచనలతో అందరూ మెచ్చేలా వర్క్ చేస్తూ ముందుకు వెళ్తున్న వెంకట్ కొమ్మోజూకి చిత్రసీమలో ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం..
-ఎం.డి. అబ్దుల్