వరుస ఆఫర్స్ తో దూసుకెళుతున్న ప్రియాంక తుంపల!

Popular and most happening voice artist in TFI Priyanka Tumpala is in full demand
Popular and most happening voice artist in TFI Priyanka Tumpala is in full demand
Spread the love

ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రియాంక తుంపాల టాలీవుడ్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతున్నారు. తన కార్పొరేట్ వృత్తిని కొనసాగిస్తూనే ఆమె డబ్బింగ్ కెరీర్ ని కూడా కంటిన్యూ చేస్తున్నారు.16 ఏళ్ల కెరీర్ లో 2008 నుంచి ఇప్పటి వరకు ప్రియాంక తుంపాల 150 పైగా చిత్రాలకు డబ్బింగ్ అందించారు. ఆమె తన మొదటి చిత్రం విలేజ్ లో వినాయకుడు చిత్రంలో శరణ్య మోహన్ కి డబ్బింగ్ చెప్పి గుర్తింపు పొందారు. అప్పటి నుంచి వరుసగా ప్రియాంకకి అవకాశాలు వస్తున్నాయి.
డబ్బింగ్ లో ఆమె ఎంతో ప్రతిభ కలిగిన వాయిస్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. ప్రతి నటీమణికి ప్రియాంక వారికి సెట్ అయ్యే విధంగా వైవిధ్యం చూపిస్తూ డబ్బింగ్ చెప్పగలదు. ఒక నటికి మరొక నటికీ పోలిక లేకుండా వారి బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా వాయిస్ ఇవ్వడం ప్రియాంక ప్రత్యేకత. దర్శకులు, రచయితలు కోరుకున్న విధంగా ఆ పాత్రలకు ప్రియాంక తన డబ్బింగ్ తో ప్రాణం పోయగలదు.
డిస్ని మర్వెల్ సంస్థల గుర్తింపు పొందిన కొద్దిమంది ఇండియన్ వాయిస్ ఆరిస్ట్ లలో ప్రియాంక ఒకరు. ఈ క్రింద పేర్కొనబడిన డిస్ని మర్వెల్ చిత్రాలకు అద్భుతమైన డబ్బింగ్ అందించారు.
కెప్టెన్ మర్వెల్ చిత్రంలో నటి బ్రీ లార్సెన్ పాత్రకి..
జంగిల్ క్రూజ్ చిత్రంలో ఎమిలీ బ్లంట్ పాత్రకి ..
ఎటెర్నల్స్ చిత్రంలో జెమ్మా చాన్ పాత్రకి..
ఎవెంజర్స్ ఎండ్ గేమ్ లో కెప్టెన్ మర్వెల్ పాత్రకి.. అలాగే ఇండియానా జోన్స్ అండ్ ది డైల్ ఆఫ్ డెస్టినీ చిత్రంలో నటి ఫోబీ మేరీ వాలెర్ బ్రిడ్జి పాత్రకి డబ్బింగ్ అందించారు ఈ చిత్రం జూన్ 30న రిలీజ్ కి రెడీ అవుతోంది.
కాజల్ అగర్వాల్, రాశి ఖన్నా, తమన్నా, తాప్సి, కీర్తి సురేష్, పూజా హెగ్డే, సాయి పల్లవి, రెజీనా, నభా నటేష్ నిధి అగర్వాల్, నేహా శెట్టి, అనన్య పాండే, ఐశ్వర్య లక్ష్మి, కేతిక శర్మ లాంటి స్టార్ హీరోయిన్స్ అందరికి ప్రియాంక తన వాయిస్ అందించడం విశేషం.
ప్రియాంక తుంపాల డబ్బింగ్ అందించిన కొన్ని ప్రముఖ చిత్రాల లిస్ట్ :
100 %లవ్, బద్రీనాథ్
కెమెరామెన్ గంగతో రాంబాబు
ఊహలు గుసగుసలాడే – రాశి ఖన్నా
రన్ రాజా రన్ – సీరత్ కపూర్
నేను శైలజ – కీర్తి సురేష్
ఘాజి – తాప్సి
గీతా గోవిందం – రష్మిక
తొలిప్రేమ – రాశి ఖన్నా
డీజే – పూజా హెగ్డే
గేమ్ ఓవర్ – తాప్సి
చెక్ – రకుల్ ప్రీత్ సింగ్
మిస్టర్ మజ్ను – నిధి అగర్వాల్
నన్ను దోచుకుందువటే – నభా నటేష్
సోలో బ్రతుకే సో బెటర్ -నభా నటేష్
ప్రతి రోజూ పండగే -రాశి ఖన్నా
పక్కా కమర్షియల్ -రాశి ఖన్నా
గాడ్సే -ఐశ్వర్య లక్ష్మి
అమ్ము -ఐశ్వర్య లక్ష్మి
ఊర్వశివో రాక్షసివో – అను ఇమ్మాన్యుయేల్
లైగర్ – అనన్య పాండే
1 నేనొక్కడినే – కృతి సనన్
నేనే రాజు నేనే మంత్రి – కాజల్
సీత – కాజల్
రంగ రంగ వైభవంగా – కేతిక
డీజే టిల్లు & 2 – నేహా శెట్టి
మారి 2 – సాయి పల్లవి సార్ – సంయుక్త మీనన్ లాంటి ఎన్నో అద్భుత చిత్రాలకు ఆమె డబ్బింగ్ అందించారు. ప్రస్తుతం పలు చిత్రాలకు ఆమె వర్క్ చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రియాంక మరిన్ని అవకాశాలతో దూసుకెళ్లాలని మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం.