‘ ప్రేమ సేవా సదనం’ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం

aler -doctors day
Spread the love

(టాలీవుడ్ టైమ్స్ న్యూస్)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వైరస్ నుండి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వైద్యసేవలను అందిస్తున్న వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామని ప్రేమసేవా సదనం స్వచ్ఛంధ సేవా సంస్థ ఆలేరు డైరెక్టర్ మహమ్మద్ ఖుర్షీద్ పాషా అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రేమ సేవా సదనం స్వచ్ఛంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు డా.లక్ష్మీ నారాయణకు సన్మానం చేశారు. పేదలకు వైద్యం అందించడంలో తమ వంతుగా వైద్యులు ఎంతగానో సేవ చేస్తున్నారని, మున్ముందు ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు వైద్య సేవలు మరింతగా తోడ్పడాలన్నారు‌. ప్రజా క్షేమమే ధ్యేయంగా తక్కువ ఖర్చుతో మందులు అందిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకవరం మోహన్ రావు, కౌన్సిలర్ గుత్తా శమంతా రెడ్డి, డానియల్, చెక్కిల్ల మోహన్ ,మల్లికార్జున్, శేష గిరి రావు, దివిజ ఫౌండేషన్ చైర్మన్ పటేల్ వంశీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment