డా. రాజశేఖర్ నటించిన 91వ చిత్రం `శేఖర్`. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. కథ ప్రకారం రాజశేఖర్ కుమార్తె పాత్రలో శివాని నటించారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పిస్తున్న ఈ చిత్రం పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై రూపొందింది. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్‌ను శనివారంనాడు విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. మే 20న ఈ చిత్రం విడుదకానున్నట్లు జీవితా రాజశేఖర్ ప్రకటించారు.
వెంకట సాయి ఫిల్మ్ బ్యానర్ లో ముత్యాల రాందాస్ ఈ చిత్రానికి సహకరిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకురాలు జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. మాకెంతో సహకరించిన నిర్మాతలు బీరం సుధాకర్ రెడ్డి, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, వంకాయలపాటి మురళీక్రిష్ణ లకు ధన్యవాదాలు. ఈ చిత్రం. ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేస్తుంది. కోవిడ్ వల్ల ప్రతి కుటుంబం చాలా సఫర్ అయిన ఎమోషన్స్‌ను ఈ చిత్రంలో చూస్తారు. రాజశేఖర్‌గారు నటించిన గోరింటాకు, అక్కమొగుడు,మా అన్నయ్య, సింహారాశి వంటి ఎన్నో చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు రాబోయే `శేఖర్` చిత్రం కూడా ఆయన స్థాయిని పెంచేలా వుంటుంది. ఈ శేఖర్ సినిమా అనుకున్న టైంలో పూర్తి కావడానికి నటీనటులు, సాంకేతిక సిబ్బంది కృషి ఎంతో వుంది. రాజశేఖర్‌గారు కొత్త సినిమా లుక్ పనిమీద వుండడం వల్ల రాలేకపోయారు. త్వరలో ఆ సినిమా వివరాలు కూడా తెలియజేస్తాం అన్నారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ.. గరుడవేగ, కల్కి వంటి హిట్ సినిమాలు చేసిన తరువాత మేం ఒక సినిమా చూశాం. ఆ సినిమాను తెలుగులో చెయ్యాలనుకుంటున్నామని జీవితాగారు చెప్పినప్పుడు నా పార్టర్ బీరం సుధాకర్ తో కలిసి నిర్మించాం. రాజశేఖర్‌గారి భిన్నమైన గెటప్‌తోపాటు ఎమోషన్, యాక్షన్,సెంటిమెంట్ ఉన్న మంచి సినిమా చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. రాజశేఖర్ గారు సినిమాకు ఎంతో ప్రాణం పెట్టి పని చేశారు. ఈ సినిమా చూసిన ముత్యాల రాందాస్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తానని ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. నాకు రాజశేఖర్ అంటే ఎంతో ఇష్టం. ఇప్పటివరకు చూడనటువంటి రాజశేఖర్ ఆహార్యం చూసి ఈ సినిమా బాగుంటుందనే నమ్మకంతో సినిమాను చూపించమని అడిగాను. జీవిత, నిర్మాతలు ఈ సినిమాను చూపించారు. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను వెంకట సాయి ఫిల్మ్ బ్యానర్ లో మే 20 న విడుదల చేస్తున్నాను అన్నారు.
నటుడు సమీర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ప్రాధాన్యమైన పాత్రలో నటించాను. రాజశేఖర్ గారంటే యాంగ్రీ యుంగ్ మ్యాన్ అంటారు. కానీ సెట్ లో అందరితో చాలా జాలీగా ఉండేవారు. నా కెరీర్లో ఎంతో ఎంజాయ్ చేసిన సినిమా ఇది. జీవితగారు దర్శకురాలిగా అన్నీ బాధ్యతలు తీసుకున్నారు. రాజశేఖర్ గెటప్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దాంతో ఈ సినిమా 50% సక్సెస్ సాధించింది. తనెంత కష్టపడ్డాడో తన వర్క్ ఏంటో ఈ సినిమా ద్వారా కనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసికెళ్లింది. ఇప్పటి వరకు నేను చూసిన రాజశేఖర్ గారి సినిమాలలో బెస్ట్ అవుతుంది. నేను కూడా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నానని అన్నారు.
నటుడు భరణి శంకర్ మాట్లాడుతూ.. జీవితగారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. రాజశేఖర్ గారితో నటించడం మొదటిసారి. తను చేసే కొన్ని సీన్స్ కు మేమే కనెక్ట్ అవ్వడంతో మాకే తెలియకుండా మా కళ్ళలో నీళ్లు వచ్చేవి. రాజశేఖర్ గారు అంత అద్భుతంగా నటించారు. వారితో వర్క్ చేయడం మాకు వండర్ఫుల్ జర్నీ.అనూప్ గారు తన పాటలతో సినిమాకు ప్రాణం పోశారు. అన్ని పాటలు చాలా అల్టిమేట్ గా ఉన్నాయి. స్క్రీన్ మీద మీకు మేం చేసిన అల్లరి చూసి చాలా ఎంజాయ్ చేస్తారు..ఇలాంటి మంచి ఛాన్స్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు.మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నాను అన్నారు.
నటుడు రవి వర్మ మాట్లాడుతూ.. నా కెరీర్ లో ఫుల్ ఎమోషన్ జర్నీ చేసిన సినిమా”శేఖర్”.ఇప్పటివరకు రాజశేఖర్ గారి గురించి విన్నానే తప్ప చూడలేదు. అటువంటిది వారితో నటించినదుకు చాలా ఆనందంగా ఉంది.ఇందులో రాజశేఖర్ గారి గెటప్ చాలా అద్భుతంగా ఉంటుంది..రాజశేఖర్ గారు ప్రతి రోజు సెట్ లో అందరినీ నవ్వించేవారు. నా కెరీర్లో ఇంత ఎంజాయ్ చేసిన సినిమా ఇదే అవుతుంది. జీవిత గారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ నటన రాబట్టుకున్నారు. ఇది రెగ్యులర్ సినిమాలా ఉండదు. ఏమోషన్ తో అటాచ్ అయిన యాక్షన్ ఇందులో ఉంటుంది. రాజశేఖర్ గారికి బెస్ట్ సినిమా అవుతుంది అన్నారు.
కెమెరామెన్ మల్లికార్జున్ నరగని మాట్లాడుతూ.. జీవిత గారు నాపై ఇంత పెద్ద ప్రాజెక్టు పెట్టారు. నేను ఇంత పెద్ద సినిమా చేస్తానని జీవితంలో కూడా అనుకోలేదు.ఈ క్రెడిట్ అంతా జీవితా రాజశేఖర్ గారికే చెందుతుందన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మాట్లాడిన వారంతా మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు
నటీనటులు
రాజశేఖర్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర .
సాంకేతిక నిపుణులు
సమర్పణ: వంకాయలపాటి మురళీక్రిష్ణ, నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జీవితా రాజశేఖర్, సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని,
పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ పార్ట్నర్: టికెట్ ఫ్యాక్టరీ, కళ: సంపత్, రైటర్: లక్ష్మీ భూపాల
మాపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు : జీవితా రాజశేఖర్
-తప్పు ఉంటే ఒప్పుకుంటా. లేదంటే దేవుణ్ణి కూడా ధైర్యంగా నిలదీస్తా – జీవితా రాజశేఖర్
ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ తమపై వచ్చిన ఆరోపణలగురించి కూలంకషంగా వివరించారు. గరుడ వేగ’ సినిమా విషయంలో జీవితా రాజశేఖర్ తమను మోసం చేశారని జోస్టార్స్ ప్రొడక్షన్స్‌కు చెందిన కోటేశ్వరరాజు, హేమ శుక్రవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా జీవిత స్పందించారు. శనివారం ఏర్పాటు చేసిన ‘శేఖర్’ సినిమా ప్రెస్‌మీట్‌లో జీవిత మాట్లాడుతూ ‘‘మాపై వచ్చిన ఆరోపణల కేసు ప్రాపెసింగ్‌లో ఉంది. నగరి నుంచి సమన్లు వచ్చి రెండు నెలలు అవుతుంది. అవి మాకు కొందరు అడ్డుకున్నారు. రెండు నెలల తర్వాత ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తెలియడం లేదు. కోటేశ్వరరాజు చేస్తోన్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదు. మేము ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు ఉంటే ఒప్పుకుంటా. లేదంటే దేవుణ్ణి కూడా ధైర్యంగా నిలదీస్తా. మాపై ఆరోపణలు చేసినవారు ఉత్తములు కాదు. వాళ్ల వల్ల మా మేనేజర్‌తోపాటు చాలామంది ఇబ్బందులు పడ్డారు. కోర్టులో కేసు నడుస్తోంది. ఏది నిజమో కోర్టు చెబుతుంది. కాబట్టి నేను పెద్దగా ఈ విషయం గురించి మాట్లాడదలచుకోలేదు. మా పరువు తీయాలని చూస్తే ఊరుకోం. మేము ఏ తప్పు చేయలేదు కోర్ట్ ఏ తీర్పు చెప్పినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం తెలిపారు.
ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో వస్తున్న తంబ్‌లైన్‌పైనా చురకలు వేశారు. ఒకప్పుడు `మా` ఎలక్షన్ సందర్భంగా మా కుటుంబం పేరు బయటకు వచ్చింది. ఇలా పలు సందర్భాల్లో మమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడంలేదు. మా మీద కొందరు పని కట్టుకుని తప్పుడు భావన కలిగేలా సోషల్ మీడియాలో థంబ్ లైన్స్ పెడుతున్నారు. అదేవిధంగా నిహారిక, మోహన్ బాబు గారి ఫ్యామిలీ గురించి కూడా చాలా దారుణమైన వార్తలను ట్రోల్ చేస్తున్నారని, తమ కుమార్తెల గురించి రకరకాల వార్తలను రాశారని అవన్నీ మానసికంగా ఎంతో బాధకు గురిచేస్తున్నాయని జీవిత అన్నారు పాజిటివ్ థింకింగ్‌తో తాను ముందుకు పోతానని, తామంటే నచ్చని వారెవరో వెనక నుండి ఇలాంటి పనులు చేస్తుంటారని ఆమె చెప్పారు.
‘శేఖర్’ నిర్మాత శ్రీనివాస్
2017లోనే కోటేశ్వరరాజు మీద డీమానుటైజేషన్ కేసు ఉందని, పోలీసుల కళ్ళు గప్పి ఆయన తిరుగుతున్నారని ‘శేఖర్’ నిర్మాత శ్రీనివాస్ చెప్పారు. అసలు రూ.26 కోట్లు ఆయన ఎక్కడ నుండి తెచ్చి ఇచ్చారో కోటేశ్వరరాజు నిరూపించుకోవాల్సి ఉంటుందని శ్రీనివాస్ అన్నారు. జీవితకు- కోటేశ్వరరాజుకు మధ్య ఉన్న వివాదంలోకి తమ ఫైనాన్షియర్ బీరం సుధాకర్ రెడ్డి పేరు తీసుకురావడం దారుణమని చెప్పారు.