‘ఎఫ్ 2’ కి మించిన ఫన్ రైడ్ ‘ఎఫ్ 3’ లో వుంటుంది : ఎడిటర్ తమ్మిరాజు

'ఎఫ్ 2' కి మించిన ఫన్ రైడ్ 'ఎఫ్ 3' లో వుంటుంది : ఎడిటర్ తమ్మిరాజు
Spread the love

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘F3’ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రాని కి పని చేసిన స్టార్ ఎడిటర్ తమ్మిరాజు మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న ‘ఎఫ్ 3’ విశేషాలు
మీ సినీ ప్రయాణం ఎలా సాగుతుంది ?
-నేను పరిశ్రమలోకి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. 1998లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఆవిడ్ ఎడిటర్ గా కెరీర్ మొదలుపెట్టాను. తర్వాత ప్రసాద్ ల్యాబ్ లో 14ఏళ్ల పాటు ఆవిడ్ ఎడిటర్ గా చేశాను. దర్శకుడు రాజమౌళి గారితో 18 ఏళ్ళు ప్రయాణం చేశాను. శాంతి నివాసం సీరియల్ నుంచి బాహుబలి 2 వరకూ రాజమౌళిగారితో పని చేశాను. దర్శకుడు అనిల్ రావిపూడిగారి తో పటాస్ నా ఫస్ట్ మూవీ. తర్వాత ఆయన సినిమాలన్నీ చేశాను. ఇప్పటివరకూ దాదాపు 30సినిమాలకు ఎడిటర్ గా చేశాను.
ఎఫ్ 2 కి ఎఫ్ 3కి టెక్నాలజీ పరంగా ఏమైనా మార్పులు వచ్చాయా ?
-అదే టెక్నాలజీ. ఐతే ప్రేక్షకుడు సినిమాని చూసే విధానం మారుతూవుంటుంది. దానికి అనుగుణంగా ఎడిటింగ్ వుండాలి.
ఎఫ్ 2 తో ఎఫ్ 3 కథ ఎలా ఉండబోతుంది ?
-ఎఫ్ 2లో పెళ్లి, తర్వాత వచ్చే కష్టాలు .. ఇలా వినోదాత్మకంగా చూపించాం. ఎఫ్ 3డబ్బు చుట్టూ తిగిరే కథ. మానవసంబంధాలు డబ్బుతో ముడిపడి వున్నాయి. ఈ పాయింట్ ఎఫ్ 3లో చాలా ఫన్ ఫుల్ గా చూపించడం జరిగింది.
ఎఫ్ 2 కి ఎఫ్ 3 పోలికలు వస్తాయా ?
-ఎఫ్ 2 ఫ్రాంచైజ్ గా వస్తున్న సినిమా ఎఫ్ 3. ఎఫ్ 2 క్యారెక్టర్లు ఉంటాయి కానీ ఎఫ్ 3 కథ మాత్రం పూర్తిగా భిన్నం. లీడ్ క్యారెక్టర్లు తీసుకొని కథని కొత్తగా చెప్పాం.
కామెడీ సినిమాలని ఎడిటింగ్ చేయడం ఎలా వుంటుంది ?
-కామెడీ సినిమాలని ఎడిటింగ్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా అనిల్ రావిపూడిగారి సినిమాల్లో అన్నీ కామెడీ పంచులు బావుంటాయి. దానిలో ఏది ట్రిమ్ చేయలన్నా కష్టంగా వుంటుంది. ఐతే ఓవరాల్ ఫ్లో చూసుకొని కథకు ఏది అవసరమో అదే వుంచుతాం.
దర్శకుడు అనిల్ రావిపూడి గారితో వర్క్ చేయడం ఎలా వుంటుంది ?
-అనిల్ రావిపూడిగారితో వర్క్ చేయడం చాలా పాజిటివ్ గా వుంటుంది. ఆయన ఎప్పుడూ ప్రేక్షకుల పక్షమే ఆలోచిస్తుంటారు. పటాస్ సినిమా నుంచి మా మధ్య అద్భుతమైన సింక్ కుదిరింది.
ఎడిటర్ అభిప్రాయాన్ని దర్శకులు గౌరవిస్తారా ?
-ఎడిటింగ్ టేబుల్ దగ్గర చాలా చర్చలు , అర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ప్రీ ప్రొడక్షన్ ఎంత చక్కగా చేస్తామో పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ కూడా అంతే జాగ్రత్తగా చేస్తే మంచి సినిమా వస్తుంది. రషస్ మొదట ఎడిటర్ చూస్తాడు. ఎడిటర్ చెప్పే సూచనలని దర్శకులు గౌరవిస్తారు.
మొదటి ప్రేక్షకుడిగా ఎఫ్ 3ఎలా అనిపించింది ?
-ఎఫ్ 2కంటే ఎఫ్ 3 డబుల్ ఫన్. ఇందులో డబ్బు గురిం చి చెప్పే కొన్ని పాయింట్లు చాలా అద్భుతంగా వుంటాయి. ప్రేక్షకులకు డబుల్ ఫన్ అందిస్తాయి.
నిర్మాత దిల్ రాజు గారి సినిమా అంటే ఎడిటర్ కి ఎక్కువ పని వుంటుంది కదా ?
-దిల్ రాజు గారు అద్భుతమైన నిర్మాత. సినిమా అంటే ఆయనకి ప్రేమ. సినిమాని చాలా జాగ్రత్తగా చూస్తారు. అయితే దిల్ రాజు గారి బ్యానర్ లో దర్శకుడు అనిల్ రావిపూడితో ఎక్కువగా పని చేయడం అనిల్ గారే కరెక్షన్స్ చూసుకుంటారు.
పాన్ ఇండియా సినిమాల ప్రభావం ఎడిటింగ్ పై ఎలా వుంటుంది ?
-నేను బాహుబలి 2కి చేశా. రాజమౌళి గారు క్రెడిట్ ఇచ్చారు. అన్ని భాషలు తెలిసిన ఎడిటర్ అయితే బావుంటుందని మేకర్స్ భావిస్తారు.
రీషూట్స్ విషయంలో ఎడిటర్ పాత్ర ఎలా వుంటుంది ?
-దర్శకుడు, నిర్మాత, ఎడిటర్ .. అందరూ కూర్చుని చర్చించిన తర్వాత ఏది అవసరమో, కాదో నిర్ణయం తీసుకుంటారు.
కథ వింటారా ?
-నేను కథ వినను. కథ వింటే ఇలా వుంటుందని ఫిక్స్ అయిపోతాం. రష్ లో అది లేకపోతే ఇలా ఎందుకైయిందనే ప్రశ్న తలెత్తుతుంది. నా వరకూ రష్ ప్రకారం ఎడిటింగ్ చేస్తా.
ఎడిటింగ్ కి సిజీకి ఎలాంటి సంబంధం వుంటుంది ?
-చాలా వుంది. బ్లూ మ్యాట్స్ ఎక్కువగా తీసుకున్నారు. అక్కడ ఏం వుంటుందో తెలీదు. దాని దృష్టి లో మనం ఎడిట్ చేసుకోవాలి. కొన్ని సార్లు అనుకున్న విజన్ రాకపోవచ్చు. మళ్ళీ చర్చించి వర్క్ చేయాల్సివుంటుంది.
ఇన్నాళ్ళ కెరీర్ లో కష్టమనిపించిన సినిమా ?
-‘మిర్చి’ కి అసోషియేట్ ఎడిటర్ గా చేసినప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశాను. పటాస్ సినిమాకి కూడా చాలా కష్టపడ్డాం.
రష్ చూశాక ఎఫ్ 3ఎలా అనిపించింది ?
-సూపర్ హిట్. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు .. మిగతా నటీనటులంతా చాలా వండర్ ఫుల్ గా చేశారు. ఎఫ్ 3 ఫన్ రైడ్ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది.
సినిమా విజయం అయినప్పుడు మిగతా వారితో పోల్చుకుంటే ఎడిటర్ కి తక్కువ క్రెడిట్ వస్తుంది కదా ?
-సినిమా సక్సెస్ దర్శకుడిదే. దర్శకుడి విజన్ తోనే ఎడిటర్ పని చేయాలి. అతను తీసిన రష్ ని ఎడిట్ చేయాలి. కాబట్టి సక్సెస్ క్రెడిట్ దర్శకుడికే చెందాలి. ఐతే మాకు రావాల్సిన గురింపు కూడా వస్తుంది.
మీతోటి ఎడిటర్స్ రిలేషన్ ఎలా వుంటుంది ?
-సినిమా విడుదలైన తర్వాత బావుందని ఫోన్ చేసి మాట్లాడతారు. ఎడిటర్స్ మధ్య మంచి వాతావరణం వుంది.
లీకేజీలు గురించి ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారు ?
-సినిమా వర్క్ జరుగుతున్నపుడు పుటేజ్ చాలా చోట్లకి వెళుతుంది. ఐతే పని చేసే వాళ్ళకి లీక్ చేయడం తప్పు అనే సంస్కారం వుండాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్వయం నియంత్రణ వుంటేనే లీకేజీలని ఆపగలం.
ఎఫ్ 3గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు ?
-ఎఫ్ 2కి మించి డబుల్ ఎంజాయ్ చేస్తారు. సూపర్ హిట్ పక్కా.
ఎఫ్ 4 కూడా వుంటుందా ?
-ఇంకా అనుకోలేదు. ఐతే ఈ ఫ్రాంచైజీ మాత్రం కొనసాగుతుంది.
చేస్తున్న కొత్త సినిమాలు ?
-కళ్యాణ్ రామ్ గారితో బింబిసార, మైత్రి మూవీ మేకర్స్ సినిమా, నాగశౌర్య కృష్ణ వ్రింద విహారి సినిమాలు చేస్తున్నా.

Related posts

Leave a Comment