WAR 2 Movie Review in Telugu..’వార్ 2′ మూవీ రివ్యూ : యాక్షన్ వార్!

WAR 2 Movie Review in Telugu.
Spread the love

(చిత్రం: వార్ 2, రేటింగ్: 3/5, నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులు. దర్శకత్వం: ఆయన్ ముఖర్జీ, కథ, నిర్మాత: ఆదిత్య చోప్రా, డైలాగ్స్: అబ్బాస్ టైర్‌వాలా, స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్, సినిమాటోగ్రఫి: బెంజమిన్, జాస్పర్, ఎడిటింగ్: ఆరీఫ్ షేక్, మ్యూజిక్: ప్రీతమ్ (బీజీఎం), సంచిత్, అంకిత్ బల్హారా (పాటలు), బ్యానర్: యష రాజ్ ఫిల్మ్స్ విడుదల: 14-08-2025 ).

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ -హృతిక్ రోషన్ ల కలయికలో వచ్చిన చిత్రం వార్ 2′. బాలీవుడ్ సహా టాలీవుడ్ నుంచి అవైటెడ్ గా ఉన్న భారీ మల్టీస్టారర్ చిత్రమిది. స్పై యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు యశ్ రాజ్ ఫిల్మ్స్. బాలీవుడ్‌లోనే బడా నిర్మాణ సంస్థగా పేరొందిన ఈ నిర్మాణ సంస్థ.. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ పేరుతో నిర్మించిన సినిమాలు యాక్షన్ ప్రియులను ఆకట్టుకున్నాయి. తాజాగా యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన చిత్రమే ‘వార్ 2’. ఇద్దరు పవర్ హౌస్‌ లాంటి హీరోలు కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నేడు (`14-08-2025) గ్రాండ్ గా విడుదలయింది. ఇద్దరు సూపర్‌స్టార్లను అయాన్ ముఖర్జీ ఎలా డీల్ చేశారు? ఈ సినిమా ఎలా ఉంది? వార్ 2 కథేంటీ? ప్రేక్షకులను వార్ 2 మెప్పించిందా? లేదా? మరి .. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం …

కథ: ఇండియన్ రా ఏజెన్సీలో నిష్ణాతుడైన ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్) ఒక కాంట్రాక్ట్ కిల్లర్ గా మారి హత్యలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, రష్యా, శ్రీలంక వంటి దేశాలు కొన్ని చేరి ‘కలి’ పేరిట భారత్ పతనాన్ని చూడలాని ప్లాన్ చేస్తారు. ఇందుకు కబీర్ సరైన వాడు అని మెషిన్ అప్పగిస్తారు. మరి భారత్ పట్ల అమితమైన ప్రేమ కలిగిన కబీర్ తన దేశానికే ద్రోహం చేసే పరిస్థితి వచ్చినప్పుడు తనని అడ్డుకోడానికి ఒక సరైన వ్యక్తి కావాలి అలా విక్రమ్ చలపతి (జూనియర్ ఎన్టీఆర్) రంగంలోకి దిగుతాడు. ఇక అక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది. మాజీ రా ఏజెంట్ కబీర్ వరుసపెట్టి బడా బాబులను హత్య చేస్తుంటాడు. భారతదేశాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకునే కలి అనే ఓ అజ్ఞాత శక్తి అతనికి ఓ టాస్క్ ఇస్తుంది. తన గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లూథ్రాని కబీర్ చంపేస్తాడు. కబీర్ కోసం రా, భారత ప్రభుత్వం వెంటాడుతుంది. ఇతనిని పట్టుకోవడానికి రా నియమించిన స్పెషల్ టీమ్‌కి మేజర్ విక్రమ్ చలపతి నాయకత్వం వహిస్తాడు. తండ్రిని చంపిన కబీర్‌పై అతని కూతురు వింగ్ కమాండర్ కావ్య లూథ్రా పగతో రగిలిపోతుంది. తనకు అడుగడుగునా అడ్డుపడుతున్న విక్రమ్ గురించి కబీర్ ఓ నిజం తెలుసుకుంటాడు. రా ఏజెంట్‌గా ఉన్న కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? సునీల్ లూథ్రాను ఎందుకు చంపాడు? కబీర్‌కు కావ్యకు ఉన్న సంబంధం ఏంటీ? కలి గ్యాంగ్ ఇండియాను ఎందుకు టార్గెట్ చేసింది? విక్రమ్, కబీర్ మధ్య సంబంధం ఏంటి? భారత్ ప్రధానికి కలి వల్ల పొంచి ఉన్న ముప్పును ఎవరు ఆపారు… ఈ క్రమంలో వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అద్వానీ) పాత్ర ఏంటి? అనేది అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ: యశ్ రాజ్ ఫిల్మ్స్ గత చిత్రాల మాదిరిగానే వార్ 2లోనూ యాక్సన్ సీన్స్, చేజింగ్‌లు నిండిపోయాయి. టీజర్, ట్రైలర్లలోనే ఈ యాక్షన్ సీక్వెన్స్‌ల గురించి దర్శకుడు అయాన్ ముఖర్జీ హింట్ ఇచ్చారు. మొదటి గంటలోనే సినిమా కథ ఏంటీ? అనేది దర్శకుడు రివీల్ చేశాడు. జపాన్‌లో కథ మొదలై ఇటలీ, జర్మనీ, ఇండియా చుట్టూ తిరుగుతుంది. ఎన్టీఆర్ ఎంటరైన దగ్గరి నుంచి కథలో సస్పెన్స్, వేగం పెరుగుతుంది. హృతిక్‌తో ఏమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ నటించారు. సరిగ్గా ఇంటర్వెల్‌కు ముందు తానెవరు? ఎందుకు ఇదంతా చేస్తున్నది విక్రమ్‌కు చెప్పేస్తాడు కబీర్. ఆకాశంలో, రెండు విమానాలతో జరిగే యాక్షన్ సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఎన్టీఆర్- హృతిక్ ఈ ఫైట్ సీన్‌లో పోటీపడి నటించారు. అప్పుడే విక్రమ్ ఎవరో కబీర్‌కు తెలియడంతో ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్‌‌ కథ చెబుతూ హీరోల గతం ఏంటి అనేది రివీల్ చేశాడు దర్శకుడు. కబీర్, విక్రమ్‌ల మైండ్ గేమ్, రా చీఫ్‌ విక్రాంత్ కావ్‌ వ్యూహాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి. విక్రమ్ – కబీర్‌ల మధ్య హోరాహోరీ పోరు, ట్విస్టులతో క్లైమాక్స్‌ను ముగించారు. ఎన్టీఆర్ – హృతిక్ రోషన్‌లు డ్యాన్స్‌లో పోటీలు పడి స్టెప్స్ వేశారు. ఈ సాంగ్ థియేటర్‌లో విజిల్స్ వేయించింది. యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచే హృతిక్ రోషన్ అలవోకగా కబీర్ పాత్రను చేసుకుంటూ వెళ్లాడు. ఫస్టాఫ్‌లో రా నుంచి తప్పించుకునే ట్రైన్ సీన్, ఇంటర్వెల్‌లో ఫ్లైట్ మీద జరిగే యాక్షన్ సీన్‌లలో అద్భుతంగా నటించి హాలీవుడ్ సినిమాలను గుర్తుచేశాడు. ఇక ఎన్టీఆర్ సంగతి చూస్తే.. హృతిక్‌కు గట్టిపోటీ ఇస్తూ యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తన యాక్టింగ్‌తో ఏడిపించేశాడు. హీరోయిన్ కియారా అద్వానీ బికినీ, లిప్‌లాక్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లోనూ తనలోని మరో షేడ్‌ను చూపించింది. అశుతోష్ రాణా, అనిల్ కపూర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు. స్ట్రాంగ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ని కోరుకునే వారు కొంచెం డిజప్పాయింట్ అవ్వొచ్చు. ముఖ్యంగా దేశ భక్తికి సంబంధించిన అంశాలు ఒకింత లోపించాయి. ఇద్దరు హీరోస్ నడుమ ఘర్షణ బాగానే ఉంది కాని అందుకు దోహదపడే పరిస్థితులు ఇంకాస్త బలంగా కనిపించి ఉంటే ఇంపాక్ట్ మరోలా ఉండి ఉండేది. అలాగే సినిమాలో మెయిన్ విలన్ కూడా వీక్ గా అనిపిస్తుంది. ఒక కనిపించని విలన్ తో యుద్ధం అంత రంజుగా అనిపించదు. ఇంకా సెకాండఫ్ లో కొంచెం మూమెంట్స్ డల్ అయ్యాయి. క్లైమాక్స్ కి వచ్చేవరకు కూడా కథనం సోసో గా సాగుతుంది. తర్వాత పికప్ అయ్యింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ యాక్షన్ సినిమాల లవర్స్ కి వార్ 2 కూడా యాక్షన్ పరంగా ఒక క్రేజీ యాక్షన్ ట్రీట్ అందిస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు. సినిమా ఆరంభం నుంచే ఒకదాన్ని మించి మరొక యాక్షన్ సీక్వెన్స్ అంతకు మించిన టెక్నీకల్ వాల్యూస్ తో అదిరే లెవెల్లో కనిపిస్తాయి. అలాగే సినిమాలో పలు ట్విస్ట్ లు గాని టర్నింగ్ లు గాని మంచి సర్ప్రైజ్ చేస్తాయి. వీటితో పాటుగా అక్కడక్కడా మంచి ఎమోషనల్ సీన్ లు కూడా బాగున్నాయి. ఇక నటీనటులు విషయానికి వస్తే.. అందరి కళ్ళు ఇద్దరు హీరోస్ మీదే ఉన్నాయి. మరి అంచనాలుకి ఏమాత్రం తీసిపోని విధంగా ఇద్దరు హీరోస్ అదరగొట్టేశారు. ఇద్దరికీ ఉన్న డిఫరెంట్ మైండ్ సెట్ తో అందుకు తగ్గ బాడీ లాంగ్వేజ్ తో అదరగొట్టారు. అయితే వార్ 1 లో హృతిక్ ని చూసాం కానీ ఇందులో మాత్రం తారక్ సర్ప్రైజ్ అని చెప్పాల్సిందే. తన ఇంటెన్స్ నటన, యాటిట్యూడ్ తన ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తాయి. జై లవకుశ లోని రావన్ లాంటి షేడ్స్, టెంపర్ లో దయా లాంటి లుక్స్ తో కలిపితే ఎలాంటి సాలిడ్ రోల్ వస్తుందో అలాంటి పెర్ఫామెన్స్ ని తను చేసాడు. ఇక అలాగే హృతిక్ తో క్లైమాక్స్ సీక్వెన్స్ లో ఫైట్స్ కానీ ఎమోషనల్ సీన్స్, ఇద్దరిపై బ్రోమాన్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక మరో హీరో హృతిక్ రోషన్ విషయానికి వస్తే మళ్లీ హృతిక్ తన మార్క్ ప్రెజెన్స్ తో ఇంప్రెస్ చేసారని చెప్పాలి. తన ఫ్యాన్స్ ఈ ఫ్రాంచైజ్ లో ఎలాగైతే కోరుకుంటున్నారో తను అదే రీతిలో కనిపించి మంచి ట్రీట్ అందించాడు. కొన్ని కొన్ని ఫ్రేమ్స్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ మరింత బాగుంది. అలాగే యాక్షన్ పార్ట్ కూడా అలవోకగా చేసేసాడు. వీటితో పాటుగా ఇద్దరు నడుమ అన్ని సన్నివేశాలు మొత్తం ఇంప్రెస్ చేస్తాయి. ఇంకా కియార తన లిమిటెడ్ రోల్ బాగా చేసింది. ఫస్టాఫ్ లో మంచి యాక్షన్ సీన్స్ దక్కాయి. వీరితో పాటుగా అసుతోష్ రానా బాగా చేశారు. ఇక సర్ప్రైజ్ నటుడు అనీల్ కపూర్ కూడా బాగానే చేశారు. ఇక కియార అద్వానీకి మరీ అంత స్కోప్ కనిపించలేదు. అనీల్ కపూర్ రోల్ కూడా మొదట్లో బానే అనిపిస్తుంది కానీ తర్వాత ఫోర్సెడ్ గా ఇరికించిన భావన కలుగక మానదు. అలాగే ఎన్టీఆర్ పాత్రని ఇంకా బాగా డిజైన్ చేయాల్సింది. ఒక రొటీన్ నెగిటివ్ టు పాజిటివ్ రోల్ గా తన పాత్ర ఇది వరకు చూసినట్టే అనిపిస్తుంది. ఇంకా అన్ని యాక్షన్ సీన్స్ పర్వాలేదు కానీ సెకండాఫ్ లో ఓ యాక్షన్ సీన్ మాత్రం చాలా సిల్లీగా అనిపిస్తుంది.

టెక్నికల్ అంశాల జోలికి వస్తే.. సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. యాక్షన్ పార్ట్ వరకు భారీ మొత్తంలో ఖర్చు పెట్టారు. యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీలు బాగున్నాయి. అలాగే ప్రీతం మ్యూజిక్ బాగా వర్క్ అయ్యింది. సినిమాలో ఎడిటింగ్ కొన్ని సన్నివేశాల్లో బాగా చేయాల్సింది. ఇక దర్శకుడు అయాన్ ముఖర్జీ విషయానికి వస్తే.. ఆదిత్య చోప్రా ఇచ్చిన కథకి డీసెంట్ కథనంతో బాగానే నడిపించారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇద్దరు హీరోస్ ని తను హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. ఒకింత చెప్పాలంటే తారక్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకున్నారు. తెలుగు ఆడియెన్స్, ఎన్టీఆర్ అభిమానులుని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన సీన్స్ కానీ స్పెషల్ స్కోర్ కానీ ఇంప్రెస్ చేస్తాయి. ఈ సినిమాకు సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారాలు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదనపు బలంగా నిలిచింది. యాక్షన్ సీక్వెన్స్‌లను బెంజమిన్ జాస్ఫర్ అద్భుతంగా చూపించి మనల్ని మరో లోకంగా తీసుకెళ్లిపోయాడు. నిర్మాణ విలువల పరంగా ఆదిత్య చోప్రా ఎక్కడా తగ్గకుండా చాలా గ్రాండీయర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Related posts

Leave a Comment