‘Tillu Square’ Movie Review in Telugu : ‘టిల్లు స్క్వేర్‌’ మూవీ రివ్యూ .. రొమాంటిక్‌ కైమ్ర్‌ కామెడీ

'Tillu Square' Movie Review .. Romantic Comedy
Spread the love

(చిత్రం: టిల్లు స్క్వేర్, దర్శకత్వం: మల్లిక్ రామ్, విడుదల తేదీ : 29, మార్చి- 2024, రేటింగ్ : 3/5, నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, మురళీ శర్మ, ప్రిన్స్, బ్రహ్మాజీ, మురళీధర్ గౌడ్ తదితరులు. దర్శకత్వం: మల్లిక్ రామ్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ & సాయి సౌజన్య, సినిమాటోగ్రాఫర్‌: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సంగీత దర్శకులు: రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో, ఎడిటింగ్: నవీన్ నూలి)
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్‌ జంటగా నటించిన రొమాంటిక్‌ కైమ్ర్‌ కామెడీ ‘టిల్లు స్క్వేర్‌’. ‘డీజే టిల్లు’ చిత్రంతో ఒక్కసారిగా సినీప్రియుల్లో భారీ క్రేజ్‌ సంపాదించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆ సినిమాలో టిల్లుగా అతడు చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడా పాత్రతో మరోమారు థియేటర్లలో నవ్వులు పూయించేందుకు ‘టిల్లు స్క్వేర్‌’ వచ్చేశాడు. ఈసారి ఇందులో
అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటించింది. టీజర్‌, ట్రైలర్లలో చూపించిన కంటెంట్‌ ‘డీజే టిల్లు’ తరహాలోనే వినోదాత్మకంగా ఉండటం.. విడుదలకు ముందే పాటలు కూడా మంచి ఆదరణ దక్కించుకోవడంతో అందరి దృష్టి ఈ సీక్వెల్‌పైనా పడింది. టాలీవుడ్ యువతరం క్రేజీ స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన గత చిత్రం “డీజే టిల్లు” ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ లా వచ్చిన చిత్రమే “టిల్లు స్క్వేర్”. దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలయింది. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో తెలుసుకుందాం…
కథ: రాధిక (నేహాశెట్టి)తో పాత పంచాయితీ ముగిశాక టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) సొంతంగా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ప్రారంభిస్తాడు. పాత గొడవలన్నీ మర్చిపోయి మళ్లీ తనదైన శైలిలో సరదాగా జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుంటాడు. సరిగ్గా అప్పుడే అతని జీవితంలోకి లిల్లీ (అనుపమ పరమేశ్వరన్‌) అనే మరో అందమైన అమ్మాయి ప్రవేశిస్తుంది. వాళ్లిద్దరూ అనుకోకుండా ఓ పబ్‌లో కలుసుకుంటారు. ముందు టిల్లు ఆమెతో మాట కలుపుతాడు. అతడి మాటలు.. వ్యవహారశైలి నచ్చి ఆమె తనతో పెదవి కలుపుతుంది. అంతే.. అదే రాత్రి ఇద్దరూ ఒక్కటవుతారు. కట్‌ చేస్తే తెల్లారేసరికి గదిలో ఒక లెటర్‌ పెట్టి లిల్లీ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. కానీ, ఆ ఒక్క పూటలోనే ఆమెను మనసంతా నింపేసుకున్న టిల్లు ఆ ఆలోచనలతో పిచ్చివాడైపోతాడు. ఆమెను వెతికి పట్టుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో నెల తర్వాత లిల్లీ ఓ ఆస్పత్రిలో టిల్లుకు ఎదురుపడుతుంది. తను గర్భవతినని చెప్పడంతో టిల్లు షాకవుతాడు. ఆ తర్వాత తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంటికి తీసుకొస్తాడు. ఈలోపు మళ్లీ టిల్లు పుట్టినరోజు వస్తుంది. ఆరోజు లిల్లీ అతన్ని తన అపార్ట్‌మెంట్‌కు రావాలని కోరడంతో తను అక్కడికి వెళ్తాడు. తీరా చూస్తే అది రాధిక (నేహా శెట్టి) ప్లాట్‌. మరి అక్కడికి వెళ్లాక టిల్లుకు ఎదురైన సమస్య ఏంటి? రాధిక, లిల్లీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? దుబాయ్‌ నుంచి వస్తున్న మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ షేక్‌ మహబూబ్‌ (మురళీశర్మ)కు ఈ కథకు ఉన్న లింకేంటి? అతన్ని చంపాల్సిన మిషన్‌లోకి టిల్లు ఎందుకొచ్చాడు? ఆల్రెడీ రాధిక వల్ల దెబ్బ తిన్న తాను ఏం చేస్తాడు? వీళ్ళ కథలోకి పేరు మోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలీ(మురళీ శర్మ)కి లింక్ ఏంటి? మళ్లీ రాధిక (నేహా శెట్టి) ఉందా లేదా అసలు చివరికి ఈ క్రేజీ రైడ్ ఎలా ముగింపు పలికింది అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే మరి..
విశ్లేషణ: సీక్వెల్‌ కథ కూడా తొలి భాగం తరహాలోనే సింపుల్‌ లైన్‌లో సాగిపోతుంది. కాకపోతే మరోసారి టిల్లు పాత్రే ఆ సాధారణమైన కథను అసాధారణమైన నటనతో అద్భుతంగా నిలబెట్టేసింది. లిల్లీ పాత్ర పరిచయ సన్నివేశాలు.. టిల్లు ఠక్కున ఆమె మాయలో పడిపోవడం.. ఒక్క రాత్రిలోనే ఇద్దరూ ఒక్కటవ్వడం.. ఇలా అంతా రాధిక ఎపిసోడ్‌ మరోసారి లిల్లీ వెర్షన్‌లో పునరావృతమవుతున్నట్లు అనిపిస్తుంది. ఇక టిల్లు తన బర్త్‌డే పార్టీని వదిలేసి లిల్లీని వెతుక్కుంటూ పాత రాధిక అపార్ట్‌మెంట్‌కే వెళ్లడం.. ఆరోజు చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ మళ్లీ అదే సమస్యలోకి దిగడం ఆసక్తిరేకెత్తిస్తుంది. ఆ తర్వాత నుంచే ఈ కథలో కొత్త కోణం బయటకొస్తుంది. నిజానికి ఈ మధ్యలో సాగే తతంగమంతా కొందరికి పాత కథను మళ్లీ చూస్తున్నామన్న అనుభూతి కలిగించినా టిల్లు పాత్ర చేసే అల్లరితో అదంతా కొట్టుకుపోతుంది. ఇక ద్వితీయార్ధం షేక్‌ మహబూబ్‌ అలీని పట్టుకునే మిషన్‌ నేపథ్యంలో సాగుతుంది. అంత పెద్ద క్రిమినల్‌ను చంపడానికి టిల్లులాంటి సాధారణ వ్యక్తితో ఎలాంటి సాహసాలు చేయిస్తారన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతుంది. నిజానికి ఆ ప్రయత్నం మరీ అంత థ్రిల్లింగ్‌గా సాగకున్నా ఎక్కడా బోర్‌ కొట్టించదు. టిల్లు పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ తనదైన నటనతో మరోసారి కట్టిపడేశాడు. లిల్లీ పాత్రలో అనుపమ తెరపై చాలా హాట్‌గా కనిపించింది. లిప్‌లాక్‌ల విషయంలో మొహమాట పడకుండా నటించింది. టిల్లు తల్లిదండ్రుల పాత్రలూ నవ్వులు పంచాయి. రాధిక పాత్రలో నేహా శెట్టి అతిథిలా తళుక్కున మెరిసింది. అలాగే ప్రియాంక జవాల్కర్‌ కూడా ఓ చిన్న పాత్రలో మెరిసింది. స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లు గా షైన్ అయ్యాడు. ఇదివరకే వచ్చిన గత సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వినోదం పరంగా ‘టిల్లు స్క్వేర్’ వాటిని అందుకుంటుంది. సినిమా టైటిల్ కార్డ్స్ నుంచే మళ్లీ టిల్లు వైబ్స్ ని గుర్తు చేస్తూ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ తో సినిమా ఆద్యంతం హుషారేకెత్తించేలా సాగుతుంది. డీజే టిల్లు కి సీక్వెల్ గా వచ్చిన ఈ క్రేజీ రైడ్ “టిల్లు స్క్వేర్” ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మాత్రం డిజప్పాయింట్ చెయ్యదు. సిద్ధూ, అనుపమ లు మెయిన్ లీడ్ లో అదరగొట్టేశారు. మంచి కామెడీ డీసెంట్ నరేషన్ సినిమాలో ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తాయి. కాకపోతే కొన్ని సీన్స్ రొటీన్ గానే ఉన్నాయి ఇవి పక్కన పెడితే మరోసారి టిల్లు గాడు మంచి క్రేజీ రైడ్ తో కూడిన ఎంటర్టైన్మెంట్ ని థియేటర్స్ లో అందిస్తాడు. అయితే.. ఈ చిత్రంలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ.. కాన్సెప్ట్ మాత్రం రొటీన్ గానే ఉందని చెప్పాలి. గత పార్ట్ 1 లానే ఇది కూడా రొటీన్ లైన్ తోనే కొనసాగుతుంది. అలాగే కొన్ని సీన్స్ ఊహాజనీతం గానే అనిపిస్తాయి. ఇంకా కొన్ని కీలక ట్విస్ట్ లు మరీ అంత ఎగ్జైట్ చెయ్యవు. సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి తన మార్క్ టైమింగ్ కామెడీతో సీన్స్ ని హిలేరియోస్ గా పండించాడు,. కొన్ని సన్నివేశాల్లో మంచి హ్యాండ్సమ్ లుక్స్ తో బాగా ఎంటర్టైన్ చేశాడు. రాధికకి అప్డేటెడ్ వెర్షన్ లేక తనకి అక్క అంటూ సినిమాలో చూపించిన రేంజ్ లోనే అనుపమ సాలిడ్ రోల్ చేసింది. తన గ్లామ్ షో ఒకెత్తు అయితే తన పెర్ఫామెన్స్ కూడా సినిమాలో అదరగొడుతుంది. అలాగే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ పలు కామెడీ సీన్స్ తో యూత్ కి ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునేవారికి ట్రీట్ ఇస్తారు. వీటితో పాటుగా సెకండాఫ్ లో ఓ సర్ప్రైజ్ కూడా మామూలుగా ఉండదు. సినిమా క్లైమాక్స్ పోర్షన్ కూడా ఒకింత రొటీన్ గానే అనిపిస్తుంది. స్టోరీ పరంగా కొన్ని అంశాలు రొటీన్ గానే ఉన్నాయి కానీ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మాత్రం తాను పుష్కలంగా అందించాడు. ఇవి పక్కన పెడితే ఒక టైం లో అనుపమ రోల్ పై ట్విస్ట్ అందరికీ రుచించకపోవచ్చు. అలాగే సెకండాఫ్ లో మురళీ శర్మ పై కొన్ని ఎపిసోడ్స్ లో లాజిక్స్ సహా కొన్ని అంశాలు వీక్ గా అనిపిస్తాయి. ఇంకా మెయిన్ లీడ్ సహా మురళీ శర్మ తన రోల్ కి న్యాయం చేకూర్చారు ఇంకా నటుడు మురళీధర్ గౌడ్ నటన ఆయన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటాయి. ఇక వీరితో పాటుగా మిగతా తారాగణం అంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.
టెక్నీకల్ గా చూస్తే… టెక్నికల్ టీం లో రామ్ మిర్యాల, అచ్చు సాంగ్స్ భీమ్స్ నేపథ్య గీతంలు బాగా ప్లస్ అయ్యాయి. అలాగే సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ మంచి కలర్ ఫుల్ గా బ్యూటిఫుల్ విజువల్స్ తో ఆకట్టుకునేలా ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగుంది. ఈ చిత్రం నిర్మాణ విలువలు బాగున్నాయి. మేకర్స్ అయితే ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు అనిపించదు. అలాగే దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సినిమాకి ఇంప్రెసివ్ వర్క్ అందించాడు. తనతో పాటుగా సిద్ధూ కూడా ఈ చిత్రానికి రచనలో తన పనితనం చూపించాడు. నరేషన్ ని మల్లిక్ అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా తీసుకెళ్లడం బాగుంది. సినిమాలోని రెండు పాటలు తెరపైనా కనువిందు చేస్తాయి. భీమ్స్‌ నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది. కూర్పు బాగా కుదిరింది. నిడివి తక్కువ ఉండటం కలిసొచ్చే అంశం. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ ‘టిల్లు స్క్వేర్’ మూవీ వినోదం పంచిన సీక్వెల్ అని చెప్పొచ్చు.

Related posts

Leave a Comment