‘#మెన్ టూ’ను ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఆద‌రిస్తారు : టీజ‌ర్ విడుదలలో హీరో శ‌ర్వానంద్‌

‘#మెన్ టూ’ను ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఆద‌రిస్తారు : టీజ‌ర్ విడుదలలో హీరో శ‌ర్వానంద్‌

నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మౌర్య సిద్ధ‌వ‌రం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమ‌వారం జ‌రిగిన ప్రెస్‌మీట్‌కి హీరో శ‌ర్వానంద్ ముఖ్య అతిథిగా హాజ‌రై టీజ‌ర్‌ను లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా… హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ ‘‘ప్రొడ్యూసర్‌ హీరో మౌర్యకి కంగ్రాజులేషన్స్. రణరంగం సినిమాలో ఇద్దరం కలిసి నటించాం. ప్రతి స్టెప్‌ నాకు చెప్పేవాడు. తను ప్రొడ్యూస్‌ చేస్తున్నానని చెప్పినప్పుడు ఎందుకు ప్రొడక్షన్‌ అని చెప్పా. అతను స్క్రిప్ట్ నచ్చి సినిమా చేశాడు. యంగ్‌స్టర్స్ కొత్తగా ఇలా చేస్తుంటే బాగా అనిపించింది. మేము ప్యాషన్‌తో, నమ్మకంతో, ఆశతో సినిమా చేస్తాం. పదేళ్ల క్రితం మేం ఈ పని…