మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) కాంటినెంటల్ హాస్పిటల్స్ (Continental Hospitals) సహాయంతో మా సభ్యులందరికి పూర్తి మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వించారు. మా సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి ఈ హెల్త్ చెకప్ ఉపయోగ పడుతుంది. మా ఆద్యుక్షుడు విష్ణు మంచు, వైస్ ప్రెసెడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ మరియు మా కుటుంబ సభ్యులు అందరు కాంటినెంటల్ హాస్పిటల్స్ చైర్మన్ గురునాథ రెడ్డి గారికి మరియు రఘునాధ రెడ్డి గారికి మరియు హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా మా ప్రెసిడెంట్ విష్ణు మంచు మాట్లాడుతూ “కాంటినెంటల్ హాస్పిటల్స్ యాజమాన్యానికి గురునాథ రెడ్డి గారికి, రఘునాధ రెడ్డి, మేఘనాధ్ గారికి ధన్యవాదాలు. జనరల్ గా మాస్టర్ హెల్త్ చెకప్ కి పదివేలు అవుతుంది, కానీ కాంటినెంటల్ హాస్పిటల్స్…